తన వారి లబ్ధి కోసమే బాబు ఐఆర్‌ఆర్‌ ప్లాన్‌ మర్చారు: ఆర్కే | Court To Hear Petition On Revoking Chandrababu's Pre-Arrest Bail In Amaravati IRR Case, Check Out Case Details Inside | Sakshi
Sakshi News home page

తన వారి లబ్ధి కోసమే బాబు ఐఆర్‌ఆర్‌ ప్లాన్‌ మర్చారు: ఆర్కే

Feb 24 2026 12:10 PM | Updated on Feb 24 2026 12:26 PM

Inner Ring Road: Alla Ramakrishna Reddy Comments On Chandrababu

సాక్షి, విజయవాడ: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ కుంభకోణం కేసులో సీఎం చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపిది. చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌కు విచారణార్హత లేదని ప్రభుత్వం తన వాదనలు వినిపించింది.

ఈ కేసు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వద్దని 542 పేజీలతో సీఐడీ కౌంటర్ వేసినట్టు కోర్టుకు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు. అదే సమయంలో కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించినట్టు కోర్టుకు చెప్పారు. కేసు క్లోజ్ చేయకుండా ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశామని ఈ నెల 27న ఏసీబీ కోర్టులో విచారణకు వస్తుందని శ్రవణ్‌కుమార్‌ కోర్టుకు తెలిపారు. వివరాలు సమర్పించాలన్న హైకోర్టు.. మార్చి 10కి వాయిదా వేసింది.

మీడియాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు గతంలో సీఎం గా ఉన్న సమయంలో ఐఆర్‌ఆర్‌ ప్లాన్ తన వారికి లబ్ధి పొందేందుకు మార్పులు చేశారని.. తాను ఈ అంశంపై సాక్ష్యాలతో సీఐడీకి ఫిర్యాదు చేశానని తెలిపారు. ‘‘నా సాక్ష్యాలను పరిశీలించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఛార్జ్‌షీట్ వేశారు. చంద్రబాబుతో పాటు మంత్రి నారాయణ, లింగమనేని రమేష్, లోకేష్, అంజనీ కుమార్‌పై కేసు నమోదైంది. వీళ్ళందరూ ఐఆర్‌ఆర్‌ను తమకు లబ్ధి కోసం అనేక మార్పులు ఐఆర్‌ఆర్‌లో అక్రమాలు చేశారు.

..అక్రమ మార్గంలో డబ్బు పొందేందుకు ఐఆర్‌ఆర్‌ను వాడుకున్నారు. 2014 ముందు లింగమనేని రమేష్ 500 ఎకరాలు పొలం ఐఆర్‌ఆర్‌ మార్గంలో కొన్నారు. చంద్రబాబు 2014లో సీఎం అయ్యాక హెరిటేజ్ సంస్థకు ఎకరం 7 లేదా 8 లక్షలకు మాత్రమే లింగమనేని అమ్మారు. ఐఆర్‌ఆర్‌ ద్వారా లాభం పొందిన కారణంగా హెరిటేజ్‌కు ఎకరం 4 కోట్లు ఉంటే 8 లక్షలకు అమ్మారు. నారా లోకేష్ కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు. చంద్రబాబు అప్పట్లో ఈ కేసులో ముందస్తు బెయిల్ పొందారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ద్వారా రూ. 2500 కోట్లు లబ్ధి పొందారు

..కానీ అప్పుడు 542 పేజీలతో బెయిల్ ఇవ్వొద్దని కోర్టులో కౌంటర్ వేసిన సీఐడీ ఇప్పుడు కేసు లేదని ఏసీబీ కోర్టును ఆశ్రయించటం దారుణం. చంద్రబాబు హోం మంత్రిగా అనితకు ఇచ్చిన లా అండ్ ఆర్డర్ మాత్రం చంద్రబాబు తన వద్దే ఉంచుకున్నారు. ఐపీఎస్‌ అధికారులపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబు తన కేసు క్లోజ్ చేయించుకుంటున్నాడు. చంద్రబాబు ఐఆర్‌ఆర్‌ కేసులో తొలి ముద్దాయి, లోకేష్ 14వ ముద్దాయి. ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబు ముద్దాయిగా తేలడం ఖాయం’’ అని ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement