విజయవాడ: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందడం బాధాకరమన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిన ఘటనేనని ఆయన ధ్వజమెత్తారు. ప్రభుత్వ మానటరింగ్ లేనందునే ఈ ఘటన చోటు చేసుకుందన్నారు.
శాసనమండలి సమావేశాల్లో భాగంగా ఈరోజు(సోమవారం ఫిబ్రవరి 23వ తేదీ) మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. అవినీతి పెచ్చుమీరిపోవడమే ఈ కల్తీకి కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగా భావిస్తున్నామని, పాలను కల్తీ చేసిన వారితో పాటు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని బొత్స డిమాండ్ చేశారు.
గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు
పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బంది పడుతున్నారని బొత్స మరోసారి స్పష్టం చేశారు. బీఏసీలో మూడు అంశాలపై ప్రస్తావించామని, అందులో రైతులకు గిట్టుబాటు ధర కూడా ఒకటన్నారు. తిరుమల లడ్డూ అంశంపై కూడా చర్చ జరగాలని కోరామని, కారు చౌకగా భూములు కేటాయింపులపై కూడా చర్చకు పట్టుబట్టునట్టి బొత్స పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబం సభ్యలు.. యూనివర్శిటీ పేరుతో విశాఖలో భూములు దోచుకుంటున్నారని మండిపడ్డారు.
వీడియో ఫుజేట్‌ను మాకు ఇవ్వాలని కోరాం
సభలో వెంకటేశ్వరస్వామి ఫోటోలను చెప్పులు ధరించి పట్టుకున్నట్లు ప్రచురించారని, మండలి చైర్మన్ చూపించిన ఫుటేజ్‌లో ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందుచేత మొత్తం వీడియో ఫుటేజ్‌ను తమకు ఇవ్వాలని కోరామన్నారు. వాస్తవాలను బయటపెట్టాలని మండలి చైర్మన్‌ను కోరామన్నారు బొత్స.


