ప్రభుత్వం మాది..ఆ ఎమ్మెల్యే మా మనిషే! | Farmer Alleges Threats And Land Dispute Files Complaint With Collector In Chittoor, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మాది..ఆ ఎమ్మెల్యే మా మనిషే!

Feb 24 2026 11:25 AM | Updated on Feb 24 2026 11:41 AM

Farmer Alleges Threats and Land Dispute Files Complaint with Collector in Chittoor

నీ భూమిని ఆక్రమిస్తాం.. దిక్కున్నచోట చెప్పుకో 
రైతు పూర్ణ చంద్రపై 
పచ్చమూకల దౌర్జన్యం 
చెర్లోపల్లె గ్రామంలో ఘటన  
కలెక్టర్‌కు ఫిర్యాదు   

చిత్తూరు కలెక్టరేట్‌ : ‘ఈ ప్రభుత్వం మాది, చిత్తూరు ఎమ్మెల్యే మా మనిషే.. నువ్వు ఎవరికి చెప్పుకున్నా ఏమీ కాదు’ అంటూ అసభ్య పదజాలంతో దూషించి.. దౌర్జన్యం చేసినట్టు రైతు పూర్ణచంద్ర వాపోయారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు పిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ గ్రామంలో వారసత్వంగా వచ్చిన సర్వే నం.654/1లోని 1.9 ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఇందులో పంటలు సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 22న తన పొలంలో జేసీబీతో శుభ్రం చేయిస్తుండగా, అదే గ్రామానికి చెందిన పాండ్యన్, అతని సోదరి ఫరీద, బావ హరి ఒక్కసారిగా పొలంలోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడినట్లు వాపోయారు.  

బెదిరింపులు, దౌర్జన్యం 
పనులు చేస్తున్న జేసీబీని ఆపివేసి, మూకుమ్మడిగా దాడికి ప్రయత్నించారన్నారు. అంతేకాకుండా, గతంలోనే రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నామని, ఇప్పుడు ఈ భూమిని కూడా వదిలేది లేదని బెదిరించినట్లు పూర్ణచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్పీకి చెప్పుకుంటావో, కలెక్టర్‌కి చెప్పుకుంటావో నీ ఇష్టం.. నీ వల్ల ఏమీ కాద్ఙు అంటూ తనను మానసికక్షోభకు గురిచేశారని కన్నీరు మున్నీరయ్యారు. తనకు ప్రాణహాని ఉందని, సాగు చేసుకుంటున్న భూమిని లాక్కోవాలని చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement