అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం | Chandrababu Did Not Answer YS Jagan Question | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం

Feb 24 2026 2:09 PM | Updated on Feb 24 2026 2:19 PM

Chandrababu Did Not Answer YS Jagan Question

సాక్షి, అమరావతి: తిరుమల ఏడు కొండలు జీవో రద్దు హామీపై చంద్రబాబు అడ్డంగా దొరికేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు పలాయనం చిత్తగించి అభాసుపాలయ్యారు. వైఎస్‌ జగన్ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దాటవేశారు.

జీవోలు  746, 747 రద్దు చేస్తానంటూ గతంలో చంద్రబాబు వ్యాఖ్యానించారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషేధించే జీవోను రద్దు చేస్తానని చంద్రబాబు గతంలో హామీ ఇచ్చారు. అయితే, సభలో తాను చేసిన ఆ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించలేదు. చంద్రబాబు వ్యాఖ్యల వీడియోను వైఎస్‌ జగన్‌ ఇటీవలే ప్రదర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నైజం బట్టబయలైంది.

 

Advertisement
 
Advertisement
Advertisement