పులివెందులలో వైఎస్‌ జగన్‌ | YS Jagan Tours Pulivendula YSR District | Sakshi
Sakshi News home page

పులివెందులలో వైఎస్‌ జగన్‌

Feb 24 2026 4:20 PM | Updated on Feb 24 2026 6:39 PM

YS Jagan Tours Pulivendula YSR District

పులివెందుల(వైఎస్సార్‌ జిల్లా): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల చేరుకున్నారు. రెండు రోజుల  పర్యటనలో భాగంగా ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 24వ తేదీ) వైఎస్‌ జగన్‌ పులివెందులకు బయల్దేరి వెళ్లారు. ఆయన ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకుని సమస్యలు తెలుసుకోనున్నారు.  పులివెందులలోని భాకరా­పురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

25వ తేదీ ఉదయం 9.30 గంటలకు పులివెందుల నివాసం నుంచి బయలుదేరి వేంపల్లి మండలం నందిపల్లి చేరుకుంటారు. అక్కడ వెలసిన నూతన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాల సందర్భంగా జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యా­హ్నం పులివెందుల చేరుకుని భాకరాపురం క్యాంప్‌ ఆఫీస్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తారు. రాత్రికి అక్కడి నివాసంలో బస చేస్తారు.

పులివెందుల చేరుకున్న జగన్

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement