12 ఏళ్ల బాలుడికి కేన్సర్
చికిత్సకు సాయం అందించాలని తల్లిదండ్రుల వేడుకోలు
శ్రీకాకుళం జిల్లా: పన్నెండేళ్ల ప్రాయం. చలాకీగా స్నేహితులతో ఆడుకోవాల్సిన ఈ వయసులో ఆస్పత్రి మంచంపై ప్రాణాల కోసం ఓ బాలుడు పోరాడుతున్నాడు. కేన్సర్ మహమ్మారితో పోరాడే స్థోమత లేక ఆ కుటుంబం దాతల సాయం కోరుతోంది. వివరాల్లోకి వెళితే.. పలాస మండలంలోని పెదంచల గ్రామానికి చెందిన కొమటూరు రామారావు, బాలమ్మకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
అందులో చిన్న కుమారుడైన 12 ఏళ్ల లింగరాజు గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. వీరిది నిరుపేద కుటుంబం. పిల్లాడికి విశాఖపట్నంలోని పినాకిల్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు. పూర్తిస్థాయి చికిత్స చేసేందుకు వారి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. దాతలు సాయం చేస్తే బిడ్డకు చికిత్స చేయించుకోగలమని వారు కోరుతున్నారు. సాయం చేయాలనుకునేవారు 7093341878 నంబర్‌ను సంప్రదించాలని వారు కోరుతున్నారు.


