వేట్లపాలెం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి | PM Modi Expresses Shock Over Vetlapalem Incident | Sakshi
Sakshi News home page

వేట్లపాలెం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Feb 28 2026 6:32 PM | Updated on Feb 28 2026 6:44 PM

PM Modi Expresses Shock Over Vetlapalem Incident

న్యూఢిల్లీ:  ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాన సానుభూతి తెలిపారు మోదీ. మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు రూ. 50వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

కాగా, వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటు చేసుకుని 23 మంది వరకూ మరణించారు. ఆ ప్రమాద సమయంలో 70 మంది వరకూ ఆ తయారీ కేంద్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని కన్నీరు మున్నీరు అవుతున్నారు. 

ఇవీ చదవండి

వేట్లపాలెంలో భారీ పేలుడు.. భారీ ప్రాణనష్టం

వేట్లపాలెం అగ్ని ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Advertisement
 
Advertisement
Advertisement