గిరిజన ఔట్‌సోర్సింగ్‌ టీచర్లకు వెన్నుపోటు | TDP govt conspiracy against outsourcing teachers | Sakshi
Sakshi News home page

గిరిజన ఔట్‌సోర్సింగ్‌ టీచర్లకు వెన్నుపోటు

Sep 17 2025 6:03 AM | Updated on Sep 17 2025 6:03 AM

TDP govt conspiracy against outsourcing teachers

విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేస్తున్న గిరిజన ఔట్‌సోర్సింగ్‌ టీచర్లు(ఫైల్‌)

ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను సైతం తప్పిన కూటమి సర్కార్‌

రోడ్డున పడనున్న 1,143 కుటుంబాలు

సాక్షి, అమరావతి: ‘డీఎస్సీ ఇచ్చినా మిమ్మల్ని తొలగించం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం.. వేతనాలు పెంచుతాం.. కాంట్రాక్ట్‌ పద్ధతిలోకి మారుస్తాం..’ ఇవీ కూటమి ప్రభుత్వం గిరిజన ఔట్‌సోర్సింగ్‌ టీచర్లకు ఇచ్చిన హామీలు. వీటిని సైతం కూటమి సర్కార్‌ చెత్త బుట్టలో పడేసి.. గిరిజన గురుకులాల ఔట్‌సోర్సింగ్‌ టీచర్ల బతుకులకు భరోసా లేకుండా చేసింది. అడవి బిడ్డలకు అక్షర వెలుగులు పంచుతున్న వారి జీవితాలను చీకట్లోకి నెట్టేసింది. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ వారిని బయటకు పంపేస్తోంది. కూటమి ప్రభుత్వ దగాతో 1,143 కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారబోతోంది. రాష్ట్రంలోని 191 గిరిజన గురుకుల విద్యాలయాల్లో మొత్తం 1,659 మంది ఔట్‌సోర్సింగ్‌ విధానంలో 10 నుంచి 18 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. తమను కాంట్రాక్ట్‌ రెగ్యులర్‌ టీచర్లుగా మార్చి.. ఉద్యోగ భద్రత

కల్పించా­లని కోరగా.. వాటిని నెరవేరుస్తామంటూ కూటమి నాయకులు ఎన్నికల సమయంలో నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోలేదు. దీంతో గతేడాది నవంబర్‌లో 45 రోజులపాటు ఆందోళన చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో 1,143 గిరిజన ఔట్‌ సోర్సింగ్‌ టీచర్ల పోస్టులు చూపించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏళ్ల తరబడి సేవలు అందిస్తున్న తాము అన్యాయమైపోతామంటూ ధర్నాలు చేశారు.

ఈ నేపథ్యంలో వారితో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి చర్చలు జరిపారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని, వేతనాలు పెంచుతామని, కాంట్రాక్ట్‌ పద్ధతిలోకి మారుస్తామని నమ్మబలికి సమ్మె విరమింపజేశారు. అవే విషయాలను అసెంబ్లీలో సైతం మంత్రి సంధ్యారాణి స్పష్టంగా ప్రకటించారు. జాతీయ ఎస్టీ కమిషన్‌ సైతం స్పందించింది. వారిని తొలగించవద్దని ఆదేశాలివ్వగా.. కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. 2026 వరకు వారిని కొనసాగించాలన్న హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేసింది. మీరంతా బయటకు వెళ్లిపోవాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.

మరీ ఇంత దారుణమా?
డీఎస్సీలో పోస్టులు పేర్కొన్నప్పటికీ.. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తాన్న హామీ ఏమైందని గిరిజన గురుకుల ఔట్‌ సోర్సింగ్‌ టీచర్లు, లెక్చరర్ల యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున నాయక్‌ ప్రభుత్వాన్ని ప్రశి్నంచారు. మీ ఉద్యోగాలు తొలగించబోమని పదే పదే చెప్పిన ప్రభుత్వం.. 1,143 మందిని నట్టేట ముంచిందని ఆగ్ర­హం వ్యక్తం చేశారు. డీఎస్సీలో పోస్టులు భర్తీ అవుతున్నాయని.. ఇక మీరు బయటకు వెళ్లిపోవాల్సిందేనంటూ అధికారులు చెబుతున్నారని వాపోయారు. హైకోర్టు ఆదేశాలను సైతం ప్రభు­త్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

టీసీ కోసం పీజీ విద్యార్థి అర్ధనగ్న ప్రదర్శన
ఫీజు బకాయి చెల్లించకపోతే టీసీ
ఇవ్వలేమన్న ఎస్వీ ఆర్ట్‌ కాలేజ్‌ అధికారులు

తిరుపతి సిటీ: కూటమి ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పులు, హాస్టల్‌ బకాయిలు వేలాది కోట్ల రూపాయలు పెండింగ్‌లో పెట్టింది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు కాలేజీల నుంచి ధ్రువీకరణపత్రాలు పొందలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం తిరుపతి శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీలో చోటుచేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనం. 202425 సంవత్సరంలో పీజీ పూర్తి చేసి, బీఈడీ చదవాలనుకున్న విద్యార్థి వినోద్‌ కుమార్‌ తన టీసీ కోసం కళాశాలకు వచ్చాడు.

ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు అతనికి టీసీ ఇవ్వడానికి నిరాకరించారు. దీనికి నిరసనగా ఆ విద్యార్థి అర్ధనగ్నంగా ప్రిన్సిపాల్‌ కార్యాలయం ఎదుట కూర్చొని ఆందోళన చేశాడు. తన తల్లిదండ్రులు కూలీలని, ప్రభుత్వం స్కాలర్‌íÙప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇస్తుందనే నమ్మకంతో కర్నూలు నుంచి వచ్చి చదివానని, కళాశాలలో చేరేటప్పుడు కూడా అలాట్‌మెంట్‌ కాపీలో ఫీజు ప్రభుత్వం ఇస్తుందని అప్పటి అధికారులు తెలిపారని వాపోయాడు. తీరా చూస్తే ప్రభుత్వం ఇవ్వలేదని విద్యార్థుల దగ్గర ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు. ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీల కోఆర్డినేటర్‌ అశోక్‌కుమార్‌ ఇతర విద్యార్థులు వినోద్‌కు మద్దతుగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement