breaking news
unnati
-
యువతకు ఉపాధి శిక్షణా కార్యక్రమాలు..
నిరుపేద వర్గాలకు చెందిన విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే లాభాపేక్షలేని సంస్థ అయిన ‘ఉన్నతి ఫౌండేషన్’ కాకినాడలో కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. కెప్టెన్ సుబ్బారావు ఉదార మద్దతుతో ప్రారంభమైన ఈ కేంద్రం, కీలకమైన ఉపాధి నైపుణ్యాలను , ఉద్యోగ అవకాశాలను పొందేందుకు యువతకు వీలు కల్పిస్తోంది.2024లో కాకినాడలో తన శిక్షణా కార్యక్రమాలను ఉన్నతి ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 70 మందికి పైగా యువతకు విజయవంతంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పించడంలో సహాయసహకారాలు అందించింది. అంతేకాకుండా, ఈ సంస్థ కళాశాలల్లో UNXT శిక్షణా కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కాకినాడలో దాదాపు 1,700 మంది విద్యార్థులకు చేరువవుతోంది. కొత్తగా ఏర్పాటుచేసిన ఈ వృత్తి శిక్షణా కేంద్రం, UNXT మోడల్‌తో కలిసి.. ప్రతి ఏడాది కాకినాడలో 2 వేల మందికి పైగా యువతకు నైపుణ్యం, వృత్తి శిక్షణ, ఉపాధి అవకాశాలను ఈ ఉన్నతి సంస్థ అందించనుంది . వృత్తి శిక్షణ కేంద్రంలో, శిక్షణ పొందిన ప్రతి వ్యక్తికి 35వ రోజు శిక్షణ నాటికి ఉద్యోగం లభిస్తుందనే భరోసా అందిస్తోంది. ఇది దీర్ఘకాలిక, స్థిరమైన కెరీర్లకు పునాది వేస్తుంది.“ఈ కేంద్రం ప్రారంభించడం ద్వారా, కాకినాడలో వీలైనంత ఎక్కువ మంది యువతను ఉద్యోగ రంగంలో అభివృద్ధి చెందడానికి అవసరమైన నైపుణ్యాలతో సన్నద్ధం చేయడమే మా లక్ష్యం. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయడంలో ఉదార మద్దతు ఇచ్చినందుకు కెప్టెన్ సుబ్బారావు ప్రభలకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఆయన నమ్మకం నిజంగా ప్రశంసనీయం, ఆయనతో భాగస్వామ్యం చేసుకోవడాన్ని గౌరవంగా ఉన్నతి భావిస్తోంది ” అని ఉన్నతి ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ స్వామి అన్నారు.ఈ కార్యక్రమంపై తన ఆలోచనలను కెప్టెన్ ప్రభల వెల్లడిస్తూ , “ఆంధ్రప్రదేశ్‌కు అపారమైన సామర్థ్యం ఉంది, కానీ అర్థవంతమైన ఉపాధిని పొందడానికి విద్య ఒక్కటి మాత్రమే ఎల్లప్పుడూ సరిపోదు. ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేసి ఉన్నతికి మద్దతు ఇచ్చి, తమ స్వంత కాళ్ళపై నిలబడేలా చేయడమే గాక, గౌరవప్రదంగా బతికేలా చేసేందుకు తమవంతు సహాయసహకారాలను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే చాలామంది బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, భీమా(BFSI)లో బిజినెస్ అసోసియేట్ వంటి ప్రొఫెషనల్ ఉద్యోగాలు పొందారు. మరికొందరు బీపీవో, టెలికాలింగ్ కార్యకలాపాల్లో చేరారు. అలాగే ప్రభుత్వ కళాశాలలలో ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థతో కలిసి ఉన్నతి ఫౌండేషన్ పనిచేస్తుంది. ఒక్క కాకినాడలోనే, 5 నుంచి 6 కళాశాలలతో ఉన్నతి భాగస్వామ్యం కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 29 వేలు కంటే ఎక్కువ మంది యువత దీని నుంచి పలు రకాల ప్రయోజనాలు పొందారు.(చదవండి: ఐఏఎస్ అధికారిణికి బంగారు పల్లకితో వీడ్కోలు..!) -
Singapore International Challenge Tourney: రన్నరప్‌గా భారత యువ షట్లర్
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ ఉన్నతి హుడా సింగపూర్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నమెంట్లో రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ఉన్నతి 17–21, 16–21 పాయింట్ల తేడాతో రుజానా (ఇండోనేసియా) చేతిలో పరాజయం పాలైంది. 42 నిమిషాల్లో ముగిసిన పోరులో ఉన్నతి వరుస గేమ్‌ల్లో ఓడింది. టోర్నీ ఆసాంతం రాణించిన ఉన్నతి... రెండో రౌండ్లో ఆసియా క్రీడల పతక విజేత సయిన కవాకమి (ఆ్రస్టేలియా)ను ఓడించింది. సెమీఫైనల్‌కు చేరే క్రమంలో చైనీస్ తైపీకి చెందిన ఇద్దరు షట్లర్లు సైయాంగ్ స్యూన్ లిన్, యీ టింగ్‌పై కూడా ఉన్నతి విజయాలు సాధించింది. సెమీఫైనల్లో ఉన్నతి 18–21, 21–19, 22–20తో థి ట్రాంగ్ వు (వియత్నాం)ను చిత్తు చేసింది. తొలి గేమ్‌లో పరాజయం పాలైన తర్వాత తిరిగి పుంజుకున్న ఉన్నతి... హోరాహోరీ పోరులో చక్కటి విజయంతో ఫైనల్ చేరింది. అయితే తుదిపోరులో యువ షట్లర్ అదే జోరు కనబర్చలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇదే టోర్నీలో భారత్‌కు చెందిన మరో యువ షట్లర్ దేవిక సిహాగ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది. -
ఎస్ఎస్ఈలో తొలి లిస్టింగ్
ముంబై: నైపుణ్యాన్ని పెంపొందించే నాన్‌ప్రాఫిట్ కంపెనీ.. ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్ సోషల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎస్ఎస్ఈ)లో లిస్టయ్యింది. తద్వారా ఎస్ఎస్ఈలో లిస్టయిన తొలి సంస్థగా నిలిచింది. పారదర్శక, విశ్వాసపాత్ర మెకనిజం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ ఇన్వెస్టర్లు సామాజిక సేవా కంపెనీలను గుర్తించేందుకు వీలు కల్పిస్తుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యురాలు అశ్వనీ భాటియా పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీల గుర్తింపు, విలువ మదింపునకు వీలుంటుందని తెలియజేశారు. వీటికి మద్దతివ్వడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా ఎస్ఎస్ఈ ఆలోచన విజయవంతంకాకపోవడం గమనార్హం! 2019లోనే 2019 ఆర్థిక బడ్జెట్లో ప్రభుత్వం ఎస్ఎస్ఈ ఏర్పాటుకు ప్రతిపాదించింది. సెబీ ఇటీవల నిబంధనలను రూపొందించింది. వెరసి తొలి ఎన్పీవో ఉన్నతి రూ. 2 కోట్ల సమీకరణకు తెరతీయగా.. 90 శాతం సబ్స్క్రిప్షన్ లభించింది. నిధుల్లో రూ. 1.8 కోట్లను గ్రాడ్యుయేషన్ చివరి ఏడాదిలో ఉన్న 10,000 మంది కాలేజీ విద్యార్ధులపై వెచి్చంచనున్నట్లు ఉన్నతి తెలియజేసింది. తద్వారా నైపుణ్య పెంపుతో పరిశ్రమకు అవసరమైన విధంగా విద్యార్ధులను సిద్ధం చేయనుంది. సామాజిక సంస్థలకు ఎస్ఎస్ఈ కొత్త అవకాశాలను కలి్పంచనున్నట్లు ఈ సందర్భంగా భాటియా పేర్కొన్నారు. తమ వర్క్, కార్యకలాపాల విస్తరణ, జవాబుదారీతనం, సుపరిపాలనను పెంపొందించుకునేందుకు వీలు కల్పిస్తుందని తెలియజేశారు. తొలి కంపెనీ లిస్ట్‌కావడం ద్వారా సోషల్ ఫైనాన్స్ శకం ప్రారంభంకానున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్‌ఎస్‌ఈపై త్వరలోనే సెబీ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఇష్యూ కనీస పరిమాణాన్ని రూ. 50 లక్షలకు, దరఖాస్తు మొత్తాన్ని రూ. 10,000కు కుదించనుంది. 39 కంపెనీలు ఇప్పటికే రిజిస్టరైన 39 ఎన్‌పీవోలతో ఎస్ఎస్ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నట్లు దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వీటిలో చాలావరకూ నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేశారు. ఎన్జీవోలకు ఎస్ఎస్ఈ గుర్తింపునిస్తుందని ఉన్నతి వ్యవస్థాపక డైరెక్టర్ రమేష్ స్వామి పేర్కొన్నారు. దీంతో సంస్థ విశ్వసనీయత, డాక్యుమెంటేషన్, ప్రభావాలను ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించరని వ్యాఖ్యానించారు. దేశంలో సొమ్ము అనేది సమస్యకాదంటూ మందిరాలు, మసీదులు, చర్చిలలోనే రూ. 80,000 కోట్ల సంపద ఉన్నట్లు ప్రస్తావించారు. -
ఎస్బీఐ ఆఫర్: ఫ్రీ క్రెడిట్ కార్డ్
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఖాతాదారులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. రూ. 20 వేల నుంచి రూ.25 వేల వరకూ ఖాతాలో డబ్బు నిల్వ ఉంచుతున్న వినియోగదారులకు ఉచితంగా క్రెడిట్ కార్డు ఇవ్వనున్నట్లు పేర్కొంది. వినియోగదారుడి క్రెడిట్ హిస్టరీ ఎలా ఉన్నా ఖాతాలో డబ్బు నిల్వ ఉంచితే క్రెడిట్ కార్డు ఇస్తామని చెప్పింది. నాలుగేళ్ల పాటు ఎలాంటి వార్షిక ఫీజు లేకుండా కార్డును వినియోగించుకోవచ్చని తెలిపింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు 'ఉన్నతి' అనే పథకం కింద ఉచిత క్రెడిట్‌కార్డులను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో క్రెడిట్ కార్డు వినియోగదారులు బకాయిలు పడి ఉన్నారని దీంతో కొత్త కార్డుల జారీ కావడం లేదని ఎస్బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య చెప్పారు. ఎస్బీఐ తీసుకొస్తున్న ఉన్నతి కొత్త వినియోగదారులను క్రెడిట్‌కార్డులను వినియోగించేందుకు ప్రోత్సహిస్తుందని తెలిపారు.