ఎస్‌ఎస్‌ఈలో తొలి లిస్టింగ్‌ | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌ఈలో తొలి లిస్టింగ్‌

Published Thu, Dec 14 2023 6:15 AM

SGBS Unnati Foundation became the first entity to list on the social stock exchanges - Sakshi

ముంబై: నైపుణ్యాన్ని పెంపొందించే నాన్‌ప్రాఫిట్‌ కంపెనీ.. ఎస్‌జీబీఎస్‌ ఉన్నతి ఫౌండేషన్‌ సోషల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజీ(ఎస్‌ఎస్‌ఈ)లో లిస్టయ్యింది. తద్వారా ఎస్‌ఎస్‌ఈలో లిస్టయిన తొలి సంస్థగా నిలిచింది. పారదర్శక, విశ్వాసపాత్ర మెకనిజం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్‌ ఇన్వెస్టర్లు సామాజిక సేవా కంపెనీలను గుర్తించేందుకు వీలు కల్పిస్తుందని క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్‌ సభ్యురాలు అశ్వనీ భాటియా పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీల గుర్తింపు, విలువ మదింపునకు వీలుంటుందని తెలియజేశారు. వీటికి మద్దతివ్వడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా ఎస్‌ఎస్‌ఈ ఆలోచన విజయవంతంకాకపోవడం గమనార్హం!  

2019లోనే  
2019 ఆర్థిక బడ్జెట్‌లో ప్రభుత్వం ఎస్‌ఎస్‌ఈ ఏర్పాటుకు ప్రతిపాదించింది. సెబీ ఇటీవల నిబంధనలను రూపొందించింది. వెరసి తొలి ఎన్‌పీవో ఉన్నతి రూ. 2 కోట్ల సమీకరణకు తెరతీయగా.. 90 శాతం సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. నిధుల్లో రూ. 1.8 కోట్లను గ్రాడ్యుయేషన్‌ చివరి ఏడాదిలో ఉన్న 10,000 మంది కాలేజీ విద్యార్ధులపై వెచి్చంచనున్నట్లు ఉన్నతి తెలియజేసింది. తద్వారా నైపుణ్య పెంపుతో పరిశ్రమకు అవసరమైన విధంగా విద్యార్ధులను సిద్ధం చేయనుంది.

సామాజిక సంస్థలకు ఎస్‌ఎస్‌ఈ కొత్త అవకాశాలను కలి్పంచనున్నట్లు ఈ సందర్భంగా భాటియా పేర్కొన్నారు. తమ వర్క్, కార్యకలాపాల విస్తరణ, జవాబుదారీతనం, సుపరిపాలనను పెంపొందించుకునేందుకు వీలు కల్పిస్తుందని తెలియజేశారు. తొలి కంపెనీ లిస్ట్‌కావడం ద్వారా సోషల్‌ ఫైనాన్స్‌ శకం ప్రారంభంకానున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్‌ఎస్‌ఈపై త్వరలోనే సెబీ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఇష్యూ కనీస పరిమాణాన్ని రూ. 50 లక్షలకు, దరఖాస్తు మొత్తాన్ని రూ. 10,000కు కుదించనుంది.  

39 కంపెనీలు
ఇప్పటికే రిజిస్టరైన 39 ఎన్‌పీవోలతో ఎస్‌ఎస్‌ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నట్లు దిగ్గజ స్టాక్‌ ఎక్సే్ఛంజీ ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్‌ చౌహాన్‌ వెల్లడించారు. వీటిలో చాలావరకూ నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేశారు. ఎన్‌జీవోలకు ఎస్‌ఎస్‌ఈ గుర్తింపునిస్తుందని ఉన్నతి వ్యవస్థాపక డైరెక్టర్‌ రమేష్‌ స్వామి పేర్కొన్నారు. దీంతో సంస్థ విశ్వసనీయత, డాక్యుమెంటేషన్, ప్రభావాలను ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించరని వ్యాఖ్యానించారు. దేశంలో సొమ్ము అనేది సమస్యకాదంటూ మందిరాలు, మసీదులు, చర్చిలలోనే రూ. 80,000 కోట్ల సంపద ఉన్నట్లు ప్రస్తావించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement