కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సమగ్ర జన గణనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జన గణన తొలి దశలో భాగంగా హౌస్ లిస్టింగ్ ప్రక్రియ ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెపె్టంబర్ 30 మధ్య జరుగనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఒక్కో రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో హౌస్ లిస్టింగ్‌ను కనీసం 30 రోజులపాటు నిర్వహిస్తారు.
వాస్తవానికి జన గణన 2021లో జరగాల్సి ఉండగా, కోవిడ్–19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఈసారి జన గణనను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు. తొలి దశలో 2026 ఏప్రిల్–సెపె్టంబర్‌లో హౌస్ లిస్టింగ్, రెండో దశలో 2027 ఫిబ్రవరిలో జన గణన పూర్తిచేస్తారు. హౌస్ లిస్టింగ్‌లో భాగంగా అన్ని రకాల ఇళ్లు, నివాసాలు, నిర్మాణాల వివరాలు సేకరిస్తారు. వచ్చే ఏడాది జనాభా లెక్కలను ఎల్రక్టానిక్ రూపంలో సేకరించబోతున్నారు. అంటే ఇది దేశంలో మొట్టమొదటి డిజిటల్ సెన్సస్ అని చెప్పుకోవచ్చు.


