రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
జనగణనలో భాగంగా తొలుత హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్
యజమానితో పాటు ఇంటి సమాచారం సేకరణ
ఇల్లు నిర్మించిన తీరు, గదుల వివరాలు చెప్పాలి
కార్లు, మోటార్ సైకిళ్ల వివరాలూ వెల్లడించాలి
సాక్షి, హైదరాబాద్: జనగణన–2027 తొలివిడతకు సంబంధించిన ప్రశ్నావళిని రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ఆమోదించింది. 33 ప్రశ్నలతో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సెస్ నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. సాధారణంగా వేసవి సెలవుల సమయంలో దీన్ని నిర్వహిస్తారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జనగణన ప్రక్రియను నిర్వహిస్తోంది. రాష్ట్రాల వారీగా జనగణన విభాగం సంచాలకులు దీనిని పర్యవేక్షిస్తారు.
ప్రతి ఇంటికీ సిబ్బంది..
తొలి విడత జరిగే హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సెస్‌లో భాగంగా జనగణన సిబ్బంది ప్రతి ఇంటినీ సందర్శించి నిర్దేశించిన ఫార్మాట్‌కు అనుగుణంగా వివరాలను సేకరిస్తారు. తమ పరిధిలోని ప్రతి ఇంటి వద్ద మొత్తం 33 రకాల ప్రశ్నలు అడిగి సమాచారం సేకరించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా వివరాలను పౌరులు తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు అమలు చేసే కార్యక్రమాలన్నింటికీ జనగణన గణాంకాలే అత్యంత ప్రామాణికం.
ఈ వివరాలు ఇవ్వాలి.. 

ఈ వివరాల ఆధారంగానే ప్రభుత్వం వివిధ కార్యక్రమాల అమలుకు వ్యూహాలను రచిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ తదితరాలఈ వివరాల ఆధారంగానే ప్రభుత్వం వివిధ కార్యక్రమాల అమలుకు వ్యూహాలను రచిస్తుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్ తదితరాలన్నింటికీ జనగణనే కీలకం. దేశంలో చివరగా 2011లో జనగణన జరిగింది. తర్వాత 2021లోనే జరగాల్సి ఉండగా.. కోవిడ్–19 ప్రభావంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రారంభమైన సెన్సెస్–2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్ తన మొబైల్ ఫోన్‌లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్/పోర్టల్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు. న్నింటికీ జనగణనే కీలకం. దేశంలో చివరగా 2011లో జనగణన జరిగింది. తర్వాత 2021లోనే జరగాల్సి ఉండగా.. కోవిడ్–19 ప్రభావంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది. తాజాగా ప్రారంభమైన సెన్సెస్–2027 ప్రక్రియలో ఎన్యూమరేటర్ తన మొబైల్ ఫోన్‌లో వివరాలు సేకరిస్తారు. ప్రత్యేక యాప్/పోర్టల్ ద్వారా ప్రశ్నలకు సమాధానాలు స్వీకరిస్తారు.


