Social Stock Exchange (SSE)
-
ఎస్ఎస్ఈలో సీజీఆర్ లిస్టింగ్
హైదరాబాద్: స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్ఎస్ఈ ప్రవేశపెట్టిన సోషల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎస్ఎస్ఈ)లో హైదరాబాద్ సంస్థ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్(సీజీఆర్) లిస్ట్‌కానుంది. తద్వారా ఎస్ఎస్ఈలో లిస్టయిన తొలి పర్యావరణ ఎన్జీవోగా సీజీఆర్ నిలవనుంది. యంగ్ ఎర్త్ లీడర్షిప్ ప్రోగ్రామ్ రెండో దశ(వైఈఎల్పీ–2)కు నిధుల సమీకరణ లక్ష్యంగా రూ. 85 లక్షల విలువైన ఈ ఇష్యూ వెలువడింది. ఈ నెల 7న ప్రారంభమైన ఇష్యూ 27వరకూ కొనసాగుతుంది. కఠిన పరిశీలనల తదుపరి ఎస్ఎస్ఈలో 14వ సంస్థగా సీజీఆర్ లిస్ట్‌కానున్నట్లు సంస్థ సీఈవో జి.నారాయణ రావు పేర్కొన్నారు. సెబీ అనుమతించిన జీరో కూపన్ జీరో ప్రిన్సిపల్(జెడ్‌సీజెడ్‌పీ) బాండ్ల రూపేణా నిధులను సమీకరించనుంది. వడ్డీ, అసలు ఆఫర్ చేయని ఈ బాండ్ల కొనుగోలుదారులు 80జీ ఆదాయపన్ను లబ్దిని క్లెయిమ్ చేసుకోవచ్చు. దేశీయంగా 3,300 ఎన్జీవోలు రిజిస్టర్‌కాగా, వీటిలో సుమారు 100 మాత్రమే ఎస్ఎస్ఈలో లిస్టయ్యేందుకు అర్హత కలిగి ఉన్నట్లు రావు తెలియజేశారు. ఎస్ఎస్ఈలో ఒకసారి రిజిస్టరైతే ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈలక్ష లిస్టయ్యేలోపు పలు కఠిన ప్రొటోకాల్స్‌ను ఎదుర్కోవలసి ఉంటుందని వివరించారు. రక్షణ శాఖ ఆధ్వర్యంలోని పీఎస్‌యూ భారత్ డైనమిక్స్ జీఎంగా గతంలో రావు పనిచేశారు. కాగా.. ఎస్ఎస్ఈలో లిస్టయిన తొలి సంస్థగా బెంగళూరుకు చెందిన ఎన్జీవో ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్ రికార్డు సృష్టించింది. 2022 డిసెంబర్లో ఈ సంస్థ సంపన్నవర్గాల(హెచ్ఎన్ఐలు) నుంచి రూ. 2 కోట్లవరకూ సమీకరించింది. -
రూ. 1,000కే ఎస్ఎస్ఈ ఇన్స్ట్రుమెంట్
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా లాభాపేక్షలేని సంస్థ(ఎన్పీవో)ల నిధుల సమీకరణకు మరింత వెసులుబాటు కల్పించే యోచనలో ఉంది. ఇందుకు వీలుగా ఎన్‌పీవోలు జారీ చేసే జీరో కూపన్, జీరో ప్రిన్సిపల్ ఇన్స్ట్రుమెంట్(జెడ్‌సీజెడ్‌పీ)ల కనీస పరిమాణాన్ని భారీగా తగ్గించేందుకు ప్రతిపాదించింది. వెరసి ప్రస్తుత రూ. 10,000 నుంచి రూ. 5,000 లేదా రూ. 1,000కు దరఖాస్తు కనీస పరిమాణాన్ని కుదించాలని భావిస్తోంది.ఇందుకు చర్చా పత్రాన్ని విడుదల చేసింది. తద్వారా మార్చి 14వరకూ ప్రజాభిప్రాయ సేకరణకు తెరతీసింది. సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎస్ఎస్ఈ)లతో ఎన్‌పీవోలు జెడ్సీజెడ్పీలను జారీ చేస్తుంటాయి. ప్రస్తుత ప్రతిపాదనలు అమలైతే ఎన్‌పీవోలు జారీ చేసే జెడ్సీజెడ్పీలలో రిటైలర్ల పెట్టుబడులు భారీగా పెరిగే అవకాశముంటుంది.జెడ్సీజెడ్పీలంటే? సెబీ ఎన్‌పీవోల కోసం ఎస్‌ఎస్‌ఈని ఏర్పాటు చేసింది. ఎస్ఎస్ఈలో లిస్టయిన ఎన్‌పీవోలు అందుకునే విరాళాలకుగాను జెడ్సీజెడ్పీలను జారీ చేస్తాయి. నిజానికి 2023 నవంబర్‌లో జెడ్‌సీజెడ్‌పీ కనీస పరిమాణాన్ని రూ. 2 లక్షల నుంచి రూ. 10,000కు కుదించింది. ఇదేవిధంగా జెడ్‌సీజెడ్‌పీ మొత్తం పరిమాణాన్ని రూ. కోటి నుంచి రూ. 50 లక్షలకు తగ్గించింది.ఎస్ఎస్ఈల ద్వారా రిటైలర్ల విరాళాలు పెరుగుతుండటాన్ని ఎన్‌పీవోలు సెబీ దృష్టికి తీసుకువెళ్లాయి. అయితే రూ. 10,000 కనీస పరిమాణం పలువురికి అడ్డు తగులుతున్నట్లు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత స్టాక్ ఎక్సే్ఛంజీలకు భిన్నమైన ఎస్ఎస్ఈ దేశీయంగా కొత్త విభాగంకాగా.. సామాజిక సంస్థలు, దాతలను కలపడంతోపాటు.. నిధుల ఆసరాకు వీలు కలుగుతుంది. -
పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!
స్టాక్‌మార్కెట్ అంటేనే లాభాలకోసం ఎంచుకునే ఒక మార్గం. షేర్లు లేదా ఆఫ్షన్స్ కొనుగోలు చేసినా విక్రయించినా.. ఏదైనాసరే లాభాలే ప్రధానం. అయితే లాభం ఉండదనీ, మనం పెట్టిన డబ్బు తిరిగిరాదని తెలిసీ ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారా..! కానీ అందరూ ప్రతిసారి స్వలాభం కోసమే ఆలోచించరు. కాసింత సామాజిక స్పృహ ఉన్నవాళ్లు మాత్రం రూపాయి రాకపోయినా సమాజానికి ఖర్చు చేసేవాళ్లున్నారు. అలాంటి వారికోసం స్టాక్మార్కెట్లో కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అదే ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’. అందులో షేర్లు కొనడం ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు. దానిద్వారా ఇటీవల జెరోధా సంస్థ కోటి రూపాయలు పెట్టింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్‌కి వెళ్లొచ్చు. బెంగళూరులోని శ్రీ గురువాయూరప్పన్ భజన్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తుంటుంది. కొత్తగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పదివేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్లు ఉద్యోగాల్లో చేరేలా సహకరించేందుకు ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. దానికి దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా నిధులు అవసరం అయ్యాయి. దాంతో ఆ సంస్థ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదుచేసుకుంది. ఎవరినీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండా ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. జెరోధా సంస్థ కోటి రూపాయలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా రూ.30లక్షలు, మరో ఇద్దరు చెరో రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రత్యేకంగా ఎందుకంటే.. ప్రత్యక్షంగా దాతలను అభ్యర్థించో, సోషల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానో ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు తమ సేవలకు అవసరమైన నిధులను సేకరిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎందుకనే అనుమానం రావొచ్చు. పైన తెలిపిన కార్యక్రమాలకు చాలా సమయం పట్టొచ్చు, ఆశించిన మొత్తం అందకపోవచ్చు. చాలామంది దాతలకు తాము ఇచ్చే డబ్బు దుర్వినియోగం అవుతుందేమోననే సందేహం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని ఎంచుకుంటున్నారు. ఇది దాతలకీ స్వచ్ఛంద సంస్థలకీ మధ్య వారధిలా పనిచేస్తుంది. తొలి సంస్థ ‘ఉన్నతి ఫౌండేషన్’.. మన దేశంలో 2019-20 సంవత్సరపు బడ్జెట్లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన తెచ్చారు. సామాజిక అభివృద్ధికి పాటుపడే సంస్థలకు పెట్టుబడి మార్కెట్ అందుబాటులో ఉండాలన్నదే దీని ఆశయం. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. దీని ద్వారా నిధులు పొందిన తొలి సంస్థ ఉన్నతి ఫౌండేషన్. లాభాపేక్ష లేని సంస్థలూ(ఎన్పీఓ), లాభాపేక్ష ఉన్న సామాజిక సంస్థలూ(ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్) ఇందులో నమోదుచేసుకోవచ్చు. పేదరికం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు... తదితర రంగాల్లో సేవలు అందించే సంస్థలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. డబ్బు ఇచ్చిన దాతల ఖాతాల్లో జీరోకూపన్ జీరో ప్రిన్సిపల్ పేరుతో బాండ్లను జమచేస్తారు. అవి రికార్డు కోసమే తప్ప మరే లాభమూ ఉండదు. వ్యాపార సంస్థలు ఐపీఓకి వెళ్లినట్లే సేవాసంస్థలు నిధుల సేకరణకు వెళ్తాయన్న మాట. లాభాలు ఇవే.. ఈ విధానం వల్ల అటు దాతలకీ ఇటు లబ్ధిదారులైన సంస్థలకీ ఎన్నో లాభాలున్నాయి. తెలిసిన దాతలనే మళ్లీ విరాళాల కోసం అడగలేక ఇబ్బంది పడే ఎన్జీఓలకు కొత్త దాతలు లభిస్తారు. బహిరంగంగా జరిగే లావాదేవీలు కాబట్టి ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు. డబ్బు వినియోగంలో ఎక్కడికక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. ఏ ప్రయోజనానికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలి, గడువు లోపల ఖర్చు పెట్టాలి, ఏటా ఆడిట్ నివేదికలు సమర్పించాలి... కాబట్టి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి. దాతలు తామిచ్చిన ప్రతి రూపాయీ సద్వినియోగమైందని నిర్ధారించుకోవచ్చు. సామాజిక మార్పులో భాగస్వాములమయ్యామన్న తృప్తి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల పట్ల నమ్మకమూ పెరుగుతుంది. ఆయా స్వచ్ఛంద సంస్థలూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. నిధులకు ఇబ్బంది ఉండదు కాబట్టి సేవల పరిధినీ విస్తరించుకోవచ్చు. ఇదీ చదవండి: 2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే! అయితే యాభై లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాతలు కనిష్ఠంగా పదివేల నుంచి విరాళం ఇవ్వచ్చు. దాతలకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. -
ఎస్ఎస్ఈలో తొలి లిస్టింగ్
ముంబై: నైపుణ్యాన్ని పెంపొందించే నాన్‌ప్రాఫిట్ కంపెనీ.. ఎస్‌జీబీఎస్ ఉన్నతి ఫౌండేషన్ సోషల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎస్ఎస్ఈ)లో లిస్టయ్యింది. తద్వారా ఎస్ఎస్ఈలో లిస్టయిన తొలి సంస్థగా నిలిచింది. పారదర్శక, విశ్వాసపాత్ర మెకనిజం ద్వారా ఈ ప్లాట్‌ఫామ్ ఇన్వెస్టర్లు సామాజిక సేవా కంపెనీలను గుర్తించేందుకు వీలు కల్పిస్తుందని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్‌టైమ్ సభ్యురాలు అశ్వనీ భాటియా పేర్కొన్నారు. ఇలాంటి కంపెనీల గుర్తింపు, విలువ మదింపునకు వీలుంటుందని తెలియజేశారు. వీటికి మద్దతివ్వడం ద్వారా సమాజంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే ఇంతవరకూ ప్రపంచంలో ఎక్కడా ఎస్ఎస్ఈ ఆలోచన విజయవంతంకాకపోవడం గమనార్హం! 2019లోనే 2019 ఆర్థిక బడ్జెట్లో ప్రభుత్వం ఎస్ఎస్ఈ ఏర్పాటుకు ప్రతిపాదించింది. సెబీ ఇటీవల నిబంధనలను రూపొందించింది. వెరసి తొలి ఎన్పీవో ఉన్నతి రూ. 2 కోట్ల సమీకరణకు తెరతీయగా.. 90 శాతం సబ్స్క్రిప్షన్ లభించింది. నిధుల్లో రూ. 1.8 కోట్లను గ్రాడ్యుయేషన్ చివరి ఏడాదిలో ఉన్న 10,000 మంది కాలేజీ విద్యార్ధులపై వెచి్చంచనున్నట్లు ఉన్నతి తెలియజేసింది. తద్వారా నైపుణ్య పెంపుతో పరిశ్రమకు అవసరమైన విధంగా విద్యార్ధులను సిద్ధం చేయనుంది. సామాజిక సంస్థలకు ఎస్ఎస్ఈ కొత్త అవకాశాలను కలి్పంచనున్నట్లు ఈ సందర్భంగా భాటియా పేర్కొన్నారు. తమ వర్క్, కార్యకలాపాల విస్తరణ, జవాబుదారీతనం, సుపరిపాలనను పెంపొందించుకునేందుకు వీలు కల్పిస్తుందని తెలియజేశారు. తొలి కంపెనీ లిస్ట్‌కావడం ద్వారా సోషల్ ఫైనాన్స్ శకం ప్రారంభంకానున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎస్‌ఎస్‌ఈపై త్వరలోనే సెబీ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ఇష్యూ కనీస పరిమాణాన్ని రూ. 50 లక్షలకు, దరఖాస్తు మొత్తాన్ని రూ. 10,000కు కుదించనుంది. 39 కంపెనీలు ఇప్పటికే రిజిస్టరైన 39 ఎన్‌పీవోలతో ఎస్ఎస్ఈ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహిస్తున్నట్లు దిగ్గజ స్టాక్ ఎక్సే్ఛంజీ ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశి‹Ùకుమార్ చౌహాన్ వెల్లడించారు. వీటిలో చాలావరకూ నిధుల సమీకరణ ప్రణాళికలకు తెరతీసినట్లు తెలియజేశారు. ఎన్జీవోలకు ఎస్ఎస్ఈ గుర్తింపునిస్తుందని ఉన్నతి వ్యవస్థాపక డైరెక్టర్ రమేష్ స్వామి పేర్కొన్నారు. దీంతో సంస్థ విశ్వసనీయత, డాక్యుమెంటేషన్, ప్రభావాలను ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించరని వ్యాఖ్యానించారు. దేశంలో సొమ్ము అనేది సమస్యకాదంటూ మందిరాలు, మసీదులు, చర్చిలలోనే రూ. 80,000 కోట్ల సంపద ఉన్నట్లు ప్రస్తావించారు.