2030లో అహ్మదాబాద్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌... నేడు భారత్‌ చేతికి క్రీడల పతాకం | Commonwealth Games in Ahmedabad in 2030 | Sakshi
Sakshi News home page

2030లో అహ్మదాబాద్‌లో కామన్వెల్త్‌ గేమ్స్‌... నేడు భారత్‌ చేతికి క్రీడల పతాకం

Aug 2 2026 4:04 AM | Updated on Aug 2 2026 4:04 AM

Commonwealth Games in Ahmedabad in 2030

గాందీనగర్‌: పది రోజులుగా క్రీడాభిమానులను అలరిస్తున్న గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడలు నేటితో ముగియనున్నాయి. నాలుగేళ్ల తర్వాత జరగనున్న ఈ క్రీడలకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. అహ్మదాబాద్‌ వేదికగా 2030 కామన్వెల్త్‌ క్రీడలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుత క్రీడల ముగింపు కార్యక్రమంలో కామన్వెల్త్‌ క్రీడల పతాకాన్ని భారత్‌కు అప్పగించనున్నారు. ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని గ్లాస్గోలో నేడు ప్రత్యేక ప్రదర్శన జరగనుంది.

భారత సంస్కృతిని ప్రతిబింభించేలా ప్రత్యేక సంగీత కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. 1930లో కెనడాలోని హామిల్టన్‌లో తొలి కామన్వెల్త్‌ క్రీడలు జరగగా... సరిగ్గా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా 2030లో అహ్మదాబాద్‌లో జరిగే క్రీడలు శతాబ్ది ఉత్సవాలుగా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం గ్లాస్గో ముగింపు వేడుకలకు గుజరాత్‌ ఉప ముఖ్యమంత్రి హర్‌‡్ష సంఘ్వీ హాజరై క్రీడల పతాకాన్ని స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement