breaking news
London Spirit
-
నామమాత్రపు మ్యాచ్.. లివింగ్‌స్టోన్, జూనియర్ ఏబీ విధ్వంసం
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ నుంచి ఇప్పటికే వైదొలిగిన లండన్ స్పిరిట్, బర్మింగ్హమ్ ఫోనిక్స్ మధ్య నామమాత్రపు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లండన్ స్పిరిట్ బ్యాటర్లు లియామ్ లివింగ్‌స్టోన్, డెవాల్డ్ బ్రెవిస్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బర్మింగ్హమ్ ఫోనిక్స్పై 7 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ ఫోనిక్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ జో క్లార్క్ (42 బంతుల్లో 73) రాణించగా, ఆఖర్లో సీన్ డిక్సన్ (28 బంతుల్లో 51 నాటౌట్), డొనోవన్ ఫెరీరా (5 బంతుల్లో 14 నాటౌట్) విధ్వంసం చేయడంతో బర్మింగ్హమ్ భారీ స్కోరు సాధించింది. లండన్ బౌలర్లలో ఆడమ్ మిల్నే, జేమ్స్ కోల్స్, మాసన్ క్రేన్, హెన్రీ క్రొకొంబెలు తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లండన్ స్పిరిట్ 82 బంతుల్లోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 166 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ (30 బంతుల్లో 66), డెవాల్డ్ బ్రెవిస్ (31 బంతుల్లో 55 నాటౌట్) విధ్వంసంతో లండన్ స్పిరిట్ ఈజీ విక్టరీ అందుకుంది. బర్మింగ్హమ్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్, సకిబ్ మహ్మూద్, టామ్ హెల్మ్లు తలా ఒక వికెట్ తీశారు. టోర్నీలో చివరి రెండు స్థానాల్లో ఉన్న లండన్ స్పిరిట్, బర్మింగ్ హమ్ ఫోనిక్స్ ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ కాగా, ట్రెంట్ రాకెట్స్ ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో టాప్‌లో నిలిచి క్వాలిఫయర్‌కు అర్హత సాధించింది. -
వచ్చాడు.. సిక్సర్లతో గెలిపించాడు!
‘ది హండ్రెడ్ మెన్స్ కాంపిటిషన్’-2026 ఎడిషన్‌లో లండన్ స్పిరిట్ ప్రయాణం ముగిసిపోయింది. ఎంఐ లండన్‌తో కీలక మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ బృందం తేలిపోయింది. ప్రత్యర్థి జట్టు చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.160 పరుగులులండన్లోని లార్డ్స్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ లండన్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లండన్ స్పిరిట్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో ఐదు వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది.ఓపెనర్లలో లువాన్ డ్రి ప్రిటోరియస్ మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 52) సాధించగా.. జానీ బెయిర్ స్టో (13) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన లండన్ స్పిరిట్ కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ (6), డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా తేలిపోయారు.మిగిలిన వారిలో డేవిడ్ విల్లే (18 బంతుల్లో 31), జేమ్స్ కోల్స్ (23 బంతుల్లో 30 నాటౌట్), జేమీ ఓవర్టన్ (6 బంతుల్లో 13 నాటౌట్) వేగంగా ఆడటంతో ఈ స్కోరు సాధ్యమైంది. ఎంఐ లండన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నాథన్ సోటర్ రెండేసి వికెట్లు కూల్చగా.. రిచర్ట్ గ్లీసన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.ఓపెనర్లు విఫలమైనాలండన్ స్పిరిట్ విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎంఐ లండన్ ఆదిలో తడబడింది. ఓపెనర్లు విల్ జాక్స్ (18), జేమ్స్ విన్స్ (15) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్, కెప్టెన్ సామ్ కర్రాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.రజా మెరుపులునికోలస్ 25 బంతుల్లో 39, సామ్ 23 బంతుల్లో 33 పరుగులతో రాణించారు. వీరికి తోడుగా సికిందర్ రజా దుమ్ములేపాడు. కేవలం 16 బంతుల్లోనే నాలుగు సిక్సర్ల సాయంతో 32 పరుగులు రాబట్టాడు. మిగిలిన వారిలో షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (4) విఫలం కాగా.. టామ్ కర్రాన్ 8, ఓలీ పోప్ 5 పరుగులతో అజేయంగా నిలిచి ఎంఐ లండన్ విజయాన్ని ఖరారు చేశారు.Welcome to the Hundred @SRazaB24 🔥#MILondon 💙💚 pic.twitter.com/8DpJc4IMQ7— MI London (@MILondonCricket) August 6, 2026మొత్తానికి సామ్ కర్రాన్ బృందం 94 బంతుల్లో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక లండన్ స్పిరిట్‌కు ఆరింట ఇది ఐదో ఓటమి. దీంతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.రషీద్ ఖాన్ స్థానంలోజింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా ఎంఐ లండన్ జట్టులో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇందుకు సంబంధించి ఫ్రాంఛైజీ ఆగష్టు 5న ప్రకటన విడుదల చేసింది.రషీద్ ఖాన్ ఐర్లాండ్‌తో సిరీస్ సందర్భంగా అఫ్గాన్ తరఫున విధుల్లోకి వెళ్లగా.. సికిందర్ రజాకు ఈ మేరకు బంపరాఫర్ వచ్చింది. ఇక వచ్చీరాగానే లండన్ స్పిరిట్‌తో మ్యాచ్‌లో రజా అదరగొట్టాడు. మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు రజా. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లో ఎంఐ లండన్‌కు ఆరింట ఇది నాలుగో విజయం. తద్వారా 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది.చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్ -
లార్డ్స్‌లో ఆర్చర్ అదుర్స్.. 9 పరుగులు, 4 వికెట్లు
ది హండ్రెడ్ లీగ్ 2026లో సదరన్ బ్రేవ్స్ జట్టు తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. శనివారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సదరన్ బ్రేవ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ స్పిరిట్ జట్టుకు పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించలేదు. బౌలర్లకు అనుకూలంగా ఉన్న వికెట్‌పై సదరన్ బ్రేవ్ పేసర్లు పండగ చేసుకున్నారు. ముఖ్యంగా స్టార్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నిప్పులు చెరిగాడు. ఈ ఇంగ్లండ్ స్పీడ్ స్టార్ నాలుగు వికెట్లు పడగొట్టి లండన్ జట్టును దెబ్బ తీశాడు. ఆర్చర్ తన బౌలింగ్‌లో కోటాలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. అయితే ఒకానొక దశలో 103/5తో ఉన్న లండన్ స్పిరిట్.. కేవలం 2 పరుగుల వ్యవధిలోనే మిగతా 5 వికెట్లను కోల్పోయి 105 పరుగులకే ఆలౌట్ అయింది. సదరన్ బ్రేవ్ బౌలర్లలో ఆర్చర్‌తో పాటు స్టోయినిష్ మూడు వికెట్లు పడగొట్టాడు. లండన్ బ్యాటర్లలో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (56 పరుగులు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు.అనంతరం 106 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు సదరన్ బ్రేవ్స్ కూడా తీవ్రంగా శ్రమించింది. లక్ష్య చేధనలో బ్రేవ్స్ 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ఈ సమయంలో డేవిడ్ మిల్లర్(28 బంతుల్లో 39 నాటౌట్) నిలకడగా ఆడి జట్టును గెలిపించాడు. మిల్లర్‌తో పాటు ఓపెనర్ జేమీ స్మిత్ 36 పరుగులతో రాణించాడు. ఫలితంగా సదరన్ బ్రేవ్ లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 97 బంతుల్లో చేధించింది. లండన్ బౌలర్లలో డేవిడ్ విల్లీ రెండు, జంపా, కోల్స్ తలా వికెట్ సాధించారు.చదవండి: WTC ఫైనల్ రేసు: గంభీర్‌కు మరో అగ్నిపరీక్ష! -
జూనియర్ ఏబీ విధ్వంసం.. బంతిని చూడకుండానే!
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్లో లండన్ స్పిరిట్ తొలి విజయాన్ని నమోదు చేసింది. బుధవారం ఎంఐ లండన్‌తో జరిగిన మ్యాచ్‌లో లండన్ స్పిరిట్స్ 7 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. మ్యాచ్‌లో ప్రిటోరియస్ సంచలన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ప్రిటోరియస్తో పాటు జూనియర్ డివిలియర్స్ డెవాల్డ్ బ్రెవిడ్ ఇన్నింగ్స్ కూడా మ్యాచ్‌లో హైలైట్ అని చెప్పొచ్చు.18 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు చేసి అజేయంగా నిలిచిన బ్రెవిస్ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ కొట్టిన నో-లుక్ సిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్నింగ్స్ 68వ బంతికి ఈ అద్భుతం చోటుచేసకుంది. ఓలీ స్టోన్ వేసిన బంతిని ముందే అంచనా వేసిన డెవాల్డ్ బ్రెవిస్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టాడు. ఈ క్రమంలో బంతి స్టాండ్స్ దిశగా వెళ్తున్న సమయంలో డెవాల్డ్ బ్రెవిస్ ఒక్కసారి కూడా తాను కొట్టిన షాట్‌ను చూడకుండా గ్రౌండ్‌నే చూడడం హైలైట్‌గా మారింది. ఇది చూసిన అభిమానులు @నీ కాన్ఫిడెన్స్‌కు సలాం.. బ్రెవిస్*, ఇదెక్కడి మాస్ రా మావ.. అని కామెంట్లు పెట్టేశారు. ఇంకెందుకు ఆలస్యం బ్రెవిస్ నో లుక్ సిక్స్‌ను మీరు కూడా వీక్షించండి. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. విల్ జాక్స్ (44 బంతుల్లో 65), రూథర్‌ఫోర్డ్ (19 బంతుల్లో 41) ధాటిగా ఆడారు. లండన్ స్పిరిట్ బౌలర్లలో జేమీ ఓవర్టన్ 3 వికెట్లు తీయగా, ఆండ్రూ టై, జేమ్స్ కోల్స్ చెరొక వికెట్ తీశారు.అనంతరం లండన్ స్పిరిట్ మరో 11 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ప్రిటోరియస్ (28 బంతుల్లో 64), బ్రెవిస్ (18 బంతుల్లో 37 నాటౌట్) భారీ ఇన్నింగ్స్‌లతో జట్టుకు విజయాన్ని అందించారు. Simply sensational from Dewald Brevis 🤯Watch his head position as he hits the ball...#TheHundred pic.twitter.com/eWOtOJlVXo— The Hundred (@thehundred) July 29, 2026Dewald Brevis. No-look six. Enjoy. 🥶 pic.twitter.com/qgQoBKwvkz— Lord's Cricket Ground (@HomeOfCricket) July 29, 2026Read: రహానే రిటైర్మెంట్పై బీసీసీఐ తొలి స్పందన


