47 వయస్సులో సంచలనం.. కెప్టెన్‌గా కప్‌ కొట్టాడు | Guyana Amazon Warriors Defend Lowest Total In T20s To Win Thrilling GSL 2026 Final | Sakshi
Sakshi News home page

GSL 2026: 47 వయస్సులో సంచలనం.. కెప్టెన్‌గా కప్‌ కొట్టాడు

Aug 2 2026 1:27 PM | Updated on Aug 2 2026 1:37 PM

Guyana Amazon Warriors Defend Lowest Total In T20s To Win Thrilling GSL 2026 Final

గ్లోబల్ సూపర్ లీగ్ (GSL)-2026 సీజన్ విజేతగా గయానా అమేజాన్ వారియర్స్ నిలిచింది. శనివారం ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ పోరులో శాన్ ఫ్రాన్సిస్కోను 6 పరుగుల తేడాతో ఓడించిన గయానా.. వరుసగా రెండో సారి జీఎస్‌ఎల్ టైటిల్‌ను ముద్దాడింది.

85 పరుగులే చేసినా
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గయానా అమేజాన్ వారియర్స్ కేవలం 85 పరుగులకే ఆలౌటైంది. టాప్-8 బ్యాటర్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఒకానొక దశలో 29 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కనీసం 40 పరుగులైనా చేస్తుందో లేదో అనిపించింది.

అయితే చివర్లో మాథ్యూ ఫోర్డ్ (23 బంతుల్లో 28 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో గయానా ఆ మాత్రం స్కోర్ అయినా సాధించగల్గింది. అనంతరం బౌలింగ్‌లో మాత్రం ఇమ్రాన్‌ తహీర్ సారథ్యంలో గయానా వారియర్స్ అద్భుతం చేసింది. యూనికార్న్స్ బ్యాటర్లలో ఆస్ట్రేలియా యంగ్ ప్లేయర్ ఆలివర్ పీక్ (28 బంతుల్లో 31 పరుగులు) మినహా మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.

యూనికార్న్స్ విజయానికి చివరి ఓవర్‌లో 7 పరుగులు అవసరమయ్యాయి. ఈ సమయంలో కల్లమ్ స్టో అనూహ్యంగా రనౌట్ కావడంతో యూనికార్న్స్ 79 పరుగులకే ఆలౌటైంది. గయానా బౌలర్లలో డ్వేన్‌ ప్రిటోరియస్‌ మూడు, మహ్మద్‌ నబీ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్‌ తహీర్‌ రెండు వికెట్లు సాధించాడు.

చ‌రిత్ర సృష్టించిన తహీర్‌
ఈ విజయంతో అమేజాన్ వారియర్స్ కెప్టెన్‌, సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్ ఇమ్రాన్ తహీర్ ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 టోర్నీ గెలిచిన అతి పెద్ద వయస్కుడిగా(47) తహీర్ నిలిచాడు.
చదవండి: రిటైర్మెంట్ తర్వాత రహానేకి బీసీసీఐ పెన్షన్.. నెలకి ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement