చ‌రిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్‌.. | Keshav Maharaj Scripts History With Clinical Bowling Spell To Bundle to england | Sakshi
Sakshi News home page

ENG vs SA: చ‌రిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్‌..

Sep 2 2025 9:04 PM | Updated on Sep 2 2025 9:33 PM

Keshav Maharaj Scripts History With Clinical Bowling Spell To Bundle to england

సౌతాఫ్రికా స్టార్ స్పిన్న‌ర్ కేశ‌వ్ మ‌హారాజ్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా గ‌డ్డ‌పై అద్బుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన మ‌హారాజ్.. ఇప్పుడు ఇంగ్లండ్‌పై బంతిని గింగ‌రాలు తిప్పుతున్నాడు. లీడ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో మ‌హారాజ్ త‌న స్పిన్ మ‌యాజాల‌న్ని ప్ర‌ద‌ర్శించాడు.

అత‌డి బౌలింగ్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవ‌లం 131 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. ఈ మ్యాచ్‌లో 5.3 ఓవ‌ర్లు బౌలింగ్ చేసిన మ‌హారాజ్‌.. కేవ‌లం 22 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి నాలుగు వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. ముల్డ‌ర్ 7 ఓవ‌ర్ల‌లో 33 ప‌రుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు.

 వీరిద్ద‌రితో పాటు లుంగీ ఎంగిడీ, బ‌ర్గ‌ర్ త‌లా వికెట్ సాధించారు. ఓ వికెట్ ర‌నౌట్ రూపంలో ల‌భించింది. ఇక ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ జేమీ స్మిత్‌(54) మిన‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు.  కాగా ఈ మ్యాచ్‌లో అద్బుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచిన మ‌హారాజ్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

త‌హిర్ రికార్డు బ్రేక్‌..
ఇంగ్లండ్‌పై వ‌న్డేల్లో అత్యుత్త‌మ బౌలింగ్ గ‌ణాంకాలు న‌మోదు చేసిన సౌతాఫ్రికా స్పిన్న‌ర్‌గా కేశ‌వ్(22/4) రికార్డు నెల‌కొల్పాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు ప్రోటీస్ మాజీ స్పిన్న‌ర్ ఇమ్రాన్ త‌హిర్ పేరిట ఉండేది. 2011 వ‌న్డేల్లో వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇంగ్లండ్‌పై త‌హిర్ 38 ప‌రుగులిచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తాజా మ్యాచ్‌తో త‌హిర్‌ను కేశ‌వ్ అధిగ‌మించాడు.
చదవండి: అతడు కొడితే సెంచ‌రీలు.. లేదంటే చీప్‌గా ఔట్ అవుతాడు: ఇర్ఫాన్‌ పఠాన్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement