
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో మహారాజ్ 7 వికెట్లతో చెలరేగాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ 333 పరుగులకు ఆలౌటైంది. 259/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజును ఆటను ఆరంభించిన పాకిస్తాన్ అదనంగా 72 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.
259/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజును ఆటను ఆరంభించిన పాకిస్తాన్ అదనంగా 72 పరుగులు చేసి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. పాక్ బ్యాటర్లలో కెప్టెన్ షాన్ మసూద్ (87), ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (57), షకీల్(66) అర్ద సెంచరీలతో సత్తాచాటగా.. సల్మాన్ అలీ అఘా(45) రాణించారు.
స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్ (16), మహ్మద్ రిజ్వాన్ (19) మరోసారి విఫలమయ్యారు. ప్రోటీస్ బౌలర్లలో మహారాజ్‌తో పాటు హర్మర్ రెండు, రబాడ ఓ వికెట్ సాధించారు. మహారాజ్‌కు ఇది ఓవరాల్‌గా 12వ టెస్టు వికెట్ హాల్ కావడం గమనార్హం.
తుది జట్లు
పాకిస్తాన్
అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హాక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, ముహమ్మద్ రిజ్వా (వికెట్ కీపర్), సల్మాన్ అఘా, నోమన్ అలీ,సాజిద్ ఖాన్, షాహీన్ అఫ్రిది, ఆసిఫ్ అఫ్రిది
సౌతాఫ్రికా
ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీపర్), సెనురన్ ముత్తుసామి, మార్కో జాన్సెన్, సైమన్ హార్మర్, కేశవ్ మహారాజ్, కగిసో రబడ
చదవండి: Pro Kabaddi: 11 ఓటములు.. విసిగి పోయిన హెడ్ కోచ్! ఏమి చేశాడంటే?