
ప్రోకబడ్డీ లీగ్-2025 సీజన్‌లో యూపీ యోధాస్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. గత సీజన్‌లో గ్రూపు స్టేజికే పరిమితమైన యూపీ జట్టు.. ఇప్పుడు కూడా అదే తీరును కనబరుస్తోంది. ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన యోధాస్ కేవలం ఆరింట మాత్రం విజయం సాధించి.. మిగితా 11 మ్యాచ్‌లలో ఓటములను చవిచూసింది. పర్దీప్ నర్వాల్, సురేందర్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికి యూపీ యోధాస్ గెలుపు బాట పట్టడం లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో యూపీ జట్టు 11వ స్దానంలో కొనసాగుతోంది.
2017 నుండి 2023 వరకు ప్రతి సీజన్‌లో ప్లేఆఫ్‌లకు చేరిన తమ ఆరాధ్య జట్టు.. ఇప్పుడు ఈ తరహా ప్రదర్శన చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు హెడ్ కోచ్ జస్వీర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యూపీ యోధాస్ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కోచ్ పదవి నుంచి జస్వీర్ సింగ్ తప్పుకొన్నాడు. జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో యూపీ ఘోర పరాజయం పాలైన తర్వాత జస్వీర్ తన మనసులో మాటను వెల్లడించాడు. సీజన్ 5 నుండి యోధాస్ కోచింగ్ సెటప్‌లో అంతర్భాగంగా ఉన్న జస్వీర్ సింగ్.. తన షాకింగ్ నిర్ణయంతో అందరిని ఆశ్చర్యపరిచాడు.
రైడర్స్ అట్టర్ ప్లాప్..
ఈ సీజన్‌లో యూపీ యోధాస్ రైడర్స్ అట్టర్ ప్లాప్ అయ్యారు. పర్దీప్ నర్వాల్ వంటి స్టార్ రైడర్ సైతం పాయింట్లు తీసుకురావడంలో విఫలమయ్యాడు. మొత్తం యూపీ యోధాస్ ఇప్పటివరకు 718 రైడ్స్‌కు వెళ్లగా.. కేవలం 347 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించింది. అందులో టచ్ పాయింట్స్ 229 కాగా.. బోనస్ పాయింట్స్ 118గా ఉన్నాయి. రైడ్ విజయ శాతం 38 % గా ఉంది. అటు డిఫెండర్స్ టాకిల్ విజయ శాతం 36%గా ఉంది.
చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి