ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీకి సంబంధించి మరో బిగ్ న్యూస్ అందింది. తొలుత ఫ్రాంచైజీ అమ్మకానికి పెట్టిన వార్త రాగా.. తాజాగా మహిళల ఆర్సీబీ కొత్త హెడ్ కోచ్‌ను (Malolan Rangarajan) నియమించుకుందన్న వార్త వెలువడింది. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. మలోలన్ రంగరాజన్ తమిళనాడుకు చెందిన మాజీ క్రికెటర్.
🚨 OFFICIAL ANNOUNCEMENT
Malolan Rangarajan, a key member of the RCB support staff for the last 6 years in various roles, has now been appointed as 𝗛𝗘𝗔𝗗 𝗖𝗢𝗔𝗖𝗛 for the upcoming WPL cycle.
More details, and WPL retentions announcement soon… 🤩#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/PLiDY9sxef— Royal Challengers Bengaluru (@RCBTweets) November 6, 2025
రంగరాజన్ గతంలో ఆర్సీబీ పురుషులు, మహిళల జట్లకు స్కౌట్, ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశారు. 2024 సీజన్‌లో ఆర్సీబీని ఛాంపియన్‌గా నిలిపిన ల్యూక్ విలియమ్స్ వేరే కోచింగ్ కమిట్‌మెంట్స్ కారణంగా ఆర్సీబీని వీడారు. వచ్చే సీజన్ నుంచి మలోలన్ ల్యూక్ విలియమ్స్ స్థానాన్ని భర్తీ చేస్తారు.
మరోవైపు ఇంగ్లండ్ మాజీ పేసర్ అన్యా ష్రబ్సోల్ (Anya Shrubsole)ను ఆర్సీబీ తమ బౌలింగ్ కోచ్‌గా ఎంపిక చేసింది. అన్యా గతంలో ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి 'ది హండ్రెడ్'లో సదరన్ బ్రేవ్ తరఫున ఆడింది. ష్రబ్సోల్..గత సీజన్ వరకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సునేత్ర పరంజాపే స్థానంలో బాధ్యతలు చేపట్టనుంది.
అమ్మకానికి ఆర్సీబీ
పురుషుల ఐపీఎల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు యాజమాన్యం (డియాజియో కంపెనీ) అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు కూడా సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.
ఫ్రాంచైజీలో పెట్టుబడిదారుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపింది. కొత్త యజమానులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సం ముగిసే నాటికి... అంటే వచ్చే మార్చి 31వ తేదీకల్లా విక్రయ ప్రక్రియ పూర్తిచేయనుంది.
చదవండి: సీఎస్‌కే అభిమానులకు శుభవార్త


