2026 ఐపీఎల్ (IPL) సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అభిమానులకు ఎగిరే గంతేసే శుభవార్త అందింది. ఆ ఫ్రాంచైజీ లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని (MS Dhoni) వచ్చే సీజన్ కూడా ఆడనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు. ధోనికి ఇప్పట్లో రిటైరయ్యే యోచన కూడా లేదని తెలిపాడు.
కాగా, ధోని రిటైర్మెంట్‌పై ఊహాగానాలు ప్రతి సీజన్‌కు ముందు పరిపాటిగా మారాయి. అయితే ధోని మాత్రం ఏయేటికాయేడు వాటిని పటాపంచలు చేస్తూ బరిలోకి దిగుతున్నాడు. 2026 సీజన్‌కు ముందు కూడా ఇదే సీన్ కొనసాగింది. ధోని వచ్చే సీజన్‌లో బరిలోకి దిగడని ప్రచారం జరిగింది. తాజాగా కాశీ విశ్వనాథ్ వ్యాఖ్యలతో ధోని రిటైర్మెంట్‌పై ప్రచారానికి తెరపడింది.
ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగి, ఇప్పటికీ ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు. ధోని ఇంకెంత కాలం ఐపీఎల్ ఆడతాడని క్రికెట్ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఏయేటికాయేడు ఈ సీజనే ధోనికి లాస్ట్ అని అనుకున్నా, అతను మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ కెరీర్‌ను పొడిగిస్తున్నాడు.
2026లోనూ ధోనిని మైదానంలో చూడబోతున్నామన్న వార్త అతని అభిమానులను పిచ్చెక్కిస్తుంది. సింహం మరోసారి బరిలోకి దిగబోతుందంటూ వారు సంబరాలు చేసుకుంటున్నారు.
ఆల్‌టైమ్ గ్రేట్
ఐపీఎల్ ప్రారంభం నుంచి (మధ్యలో రెండు సీజన్లు మినహా) సీఎస్‌కేతోనే ఉన్న ధోని.. ఆ ఫ్రాంచైజీకి ఐదు టైటిళ్లు (2010, 2011, 2018, 2021, 2023)అందించాడు. గత సీజన్‌లో మాత్రం సీఎస్‌కే ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది.
కెప్టెన్ రుతురాజ్ గాయపడటంతో ధోనినే కెప్టెన్సీ బాధ్యతలు మోశాడు. ఆ సీజన్‌లో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో తొలిసారి ఆఖరి స్థానంలో నిలిచింది.
మోకాలి సమస్య
రిటైర్మెంట్‌కు (అంతర్జాతీయ క్రికెట్‌కు) ముందు నుంచి ధోనిని గాయాల సమస్య వేధిస్తుంది. ముఖ్యంగా కెరీర్ మధ్య నుంచి ధోని మోకాలి సమస్యతో బాధ పడుతున్నాడు. 2023లో అతని ఎడమ మోకాలికి ప్రధాన శస్త్రచికిత్స జరిగింది.
ఆతర్వాత అతను knee brace ధరించి, పెయిన్ కిల్లర్స్ వాడుతూ అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహించాడు. 44 ఏళ్ల వయసులోనూ ధోని ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, ఆటపై తన ప్రేమను కొనసాగిస్తున్నాడు.
చదవండి: సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా


