బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో ఇవాళ (నవంబర్ 6) భారత్-ఏ, దక్షిణాఫ్రికా-ఏ (India A vs South Africa A) జట్ల మధ్య రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్కస్ ఆకెర్‌మన్ టాస్ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో చాలామంది టీమిండియా స్టార్లు బరిలోకి దిగుతున్నారు.
కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనింగ్‌కు దిగగా.. సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్, హర్ష్ దూబే, ఆకాశ్‌దీప్, కల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ ఆతర్వాత స్థానాల్లో రానున్నారు.
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఆ జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకు ప్రాక్టీస్ నిమిత్తం ఈ అవకాశం ఇచ్చారు. మరోవైపు దక్షిణాఫ్రికా-ఏ తరఫున ఆ జట్టు టెస్ట్ కెప్టెన్ టెంబా బవుమా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా టెస్ట్ జట్టులోకి ప్రెనేలన్ సుబ్రాయన్ కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.
రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్-ఏ తొలి మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రిషబ్ పంత్ (90) ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఇవాళ మొదలైన మ్యాచ్‌లో కూడా పంత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌లో గాయపడిన తర్వాత పంత్ ఆడుతున్న తొలి సిరీస్ ఇదే.
ఆదిలోనే షాక్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ మొరేకీ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. కేఎల్ రాహుల్‌కు జతగా సాయి సుదర్శన్ క్రీజ్‌లోకి వచ్చాడు.
ఇండియా A (ప్లేయింగ్ XI): KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, దృవ్ జురెల్, రిషబ్ పంత్(w/c), హర్ష్ దూబే, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ
దక్షిణాఫ్రికా A (ప్లేయింగ్ XI): జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, టెంబా బావుమా, జుబేర్ హంజా, మార్క్వెస్ అకెర్‌మాన్ (సి), కానర్ ఎస్టర్‌హుయిజెన్ (w), టియాన్ వాన్ వురెన్, కైల్ సిమండ్స్, ప్రేనెలన్ సుబ్రాయెన్, షెపో మోరేకి, ఒకుహ్లే సెలె


