breaking news
India A vs South Africa A
-
పాపం సర్ఫరాజ్ ఖాన్.. ఎందుకిలా..?
త్వరలో స్వదేశంలో సౌతాఫ్రికా-ఏతో జరుగబోయే రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల కోసం రెండు వేర్వేరు భారత-ఏ జట్లను ఇవాళ (అక్టోబర్ 21) ప్రకటించారు. రెండు జట్లకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా, సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు. ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా గాయపడిన పంత్ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు. దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, మొహమ్మద్ సిరాజ్ రెండో టెస్ట్ జట్టుకు మాత్రమే ఎంపికయ్యారు.కాగా, ఈ రెండు జట్లలో ఇన్ ఫామ్ ఆటగాళ్లు మహ్మద్ షమీ (Mohammed Shami), సర్ఫరాజ్ ఖాన్‌కు (Sarfaraz Khan) చోటు దక్కకపోవడం అందరికీ ఆశ్యర్యాన్ని కలిగించింది. షమీ గాయం నుంచి పూర్తిగా కోలుకొని తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు. వాస్తవానికి షమీ ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులోనే చోటు ఆశించాడు. అయితే ఫిట్‌నెస్‌పై అప్డేట్ లేదన్న కారణం చెప్పి సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు కూడా షమీని ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. ఫిట్‌గా ఉండి, ఫామ్‌లో ఉన్నా షమీని సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని అభిమానులు నిలదీస్తున్నారు. మరోవైపు యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ సెలెక్టర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు అంచనాలకు మించి బరువు తగ్గి, ఫామ్‌ను చాటుకున్న సర్ఫరాజ్ ఖాన్‌ను సౌతాఫ్రికా-ఏతో సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేయలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. సర్ఫరాజ్ తాజాగా ముగిసిన రంజీ మ్యాచ్‌లో 74 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అంతకుముందు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ఆథ్వర్యంలో జరిగిన బుచ్చిబాబు టోర్నీలో వరుసగా రెండు సెంచరీలు చేశాడు. దీనికి ముందు భారత్-ఏ తరఫున కూడా సర్ఫరాజ్ సత్తా చాటాడు. ఇంగ్లండ్ పర్యటన తొలి మ్యాచ్‌లో 92 పరుగులు చేశాడు. ఇంత చేసినా సర్ఫరాజ్‌ను ఏ జట్టుకు కూడా ఎంపిక చేయకపోవడం విచారకరమని అభిమానులు అంటున్నారు. సర్ఫరాజ్, షమీ.. ఏం నేరం చేశారని వారికి అవకాశాలు ఇవ్వడం లేదని అభిమానులు సెలెక్టర్ల నిలదీస్తున్నారు.సౌతాఫ్రికా-ఏతో తొలి మ్యాచ్‌కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.సౌతాఫ్రికా-ఏతో రెండో మ్యాచ్‌కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.చదవండి: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కెప్టెన్ ఔట్ -
సౌతాఫ్రికాతో సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా రిషభ్ పంత్
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ (Rishabh Pant)పునరాగమనం ఖరారైంది. గాయం నుంచి కోలుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా రీఎంట్రీ ఇవ్వనున్నాడు. సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టు (Ind A vs SA A)తో జరిగే నాలుగు రోజుల మ్యాచ్‌ల రెడ్‌బాల్ సిరీస్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి అతడిని సారథిగా ఎంపిక చేసింది.కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో బిజీగా ఉన్న టీమిండియా.. నవంబరు 14 నుంచి స్వదేశంలో సౌతాఫ్రికాతో వరుస సిరీస్‌లు ఆడనుంది. సఫారీలతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది.ముందుగా నాలుగు రోజుల మ్యాచ్‌లు అయితే, అంతకంటే ముందే.. భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య అక్టోబరు 30- నవంబరు 9 వరకు రెడ్‌బాల్ ఫార్మాట్లో నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ జట్టుకు రిషభ్ పంత్ కెప్టెన్ కాగా.. టీమిండియా యువ ఆటగాడు సాయి సుదర్శన్‌కు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ దక్కింది.పంత్ సేనలోకి ఆ టీమిండియా స్టార్లు కూడాఇక సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో మ్యాచ్ నుంచి టీమిండియా స్టార్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ కూడా పంత్ సేనలో చేరనున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరిగే ఈ రెడ్‌బాల్ సిరీస్‌కు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదిక. కాగా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా పంత్ కుడికాలికి గాయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుదీర్ఘ విశ్రాంతి తర్వాత అతడు ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.సౌతాఫ్రికా- ‘ఎ’తో తొలి ఫోర్-డే మ్యాచ్‌కు భారత జట్టు (అక్టోబరు 30- నవంబరు 2):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఆయుష్ మాత్రే, నారాయణ్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, అన్షుల్ కాంబోజ్, యశ్ ఠాకూర్, ఆయుష్ బదోని, సారాంశ్ జైన్.సౌతాఫ్రికా- ‘ఎ’తో రెండో ఫోర్-డే మ్యాచ్‌కు భారత జట్టు (నవంబరు 6- నవంబరు 9):రిషభ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్ (వైస్ కెప్టెన్), దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, మానవ్ సుతార్, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, మొహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో బవుమా దక్షిణాఫ్రికా రెగ్యులర్ టెస్టు కెప్టెన్ తెంబా బవుమా... టీమిండియా పర్యటన కోసం కసరత్తులు చేస్తున్నాడు. గాయం కారణంగా పాకిస్తాన్‌తో సిరీస్‌కు దూరమైన బవుమా... ఈ నెలాఖరులో దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టుతో పాటు భారత్‌కు రానున్నాడు. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే.నవంబర్ 14న ప్రారంభం కానున్న ఈ పర్యటన... డిసెంబర్ 19తో ముగియనుంది. దానికి ముందు ఇక్కడి పరిస్థితులపై అంచనా కోసం దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు... భారత ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడనుంది. ఈ నెల 30న బెంగళూరు వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుండగా... నవంబర్ 6 నుంచి రెండో మ్యాచ్ జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో బవుమా... దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. దీంతో ఇక్కడి పరిస్థితులపై అవగహనకు రావొచ్చని దక్షిణాఫ్రికా జట్టు యాజమాన్యం భావిస్తోంది. అకెర్మన్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులో బవుమాతో పాటు జుబేర్ హంజా, ప్రెనెలన్ సుబ్రాయన్ కూడా ఉన్నారు. చదవండి: IND vs AUS: 244 పరుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లి