టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌ను కనబరిస్తున్నాడు. సౌతాఫ్రికా-తో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్ సెంచరీల మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన సూపర్ జెంచరీతో జట్టును ఆదుకున్న జురెల్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టాడు.
జురెల్ 159 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో తన ఆరువ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తొలుత హర్ష్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ధ్రువ్.. ఆ తర్వాత కెప్టెన్ పంత్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జురెల్ ఓవరాల్‌గా 169 బంతులు ఎదుర్కొన్న జురెల్.. 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 127 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్..
ఇక ఇండియా-ఎ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 382-7 వద్ద డిక్లేర్ చేసింది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 34 పరుగుల ఆధిక్యాన్ని జోడించి సఫారీల ముందు 416 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ఇక భారత బ్యాటర్లలో జురెల్‌తో పాటు రిషబ్ పంత్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
తొలుత రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగిన పంత్.. దూబే ఔటయ్యాక మళ్లీ క్రీజులోకి వచ్చాడు. ఈసారి మాత్రం పంత్ చెలరేగిపోయాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 65 పరుగులు చేసి ఔటయ్యాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఒకుహ్లే సెలె మూడు వికెట్లు పడగొట్టగా.. షెపో మోరెకి, వుర్రెన్, సుబ్రెయిన్, సిమండ్స్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు సఫారీ ‘ఎ’ జట్టు 47.3 ఓవర్లలో 221 పరుగుల వద్ద ఆలౌటైంది. మొత్తం 11 మందిలో ఏకంగా 8 మంది బ్యాటర్లు సెనొక్వనే (0), జుబేర్ హమ్జా (8), బవుమా (0), ఎస్తర్‌హ్యుజెన్ (0), టియాన్ వాన్ (6), కైల్ సిమండ్స్ (5), షెపొ మొరెకి (4 నాటౌట్), ఒకులె సెలె (0)లను భారత సీమర్లు సింగిల్ డిజిట్‌కే కట్టడి చేశారు.
భారత పేస్ త్రయం ప్రసిధ్ కృష్ణ (3/35), ఆకాశ్ దీప్ (2/28), సిరాజ్ (2/61) నిప్పులు చెరిగారు. ప్రోటీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మార్కెస్ అకెర్మన్ (118 బంతుల్లో 113; 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీతో కదం తొక్కాడు. కాగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు ఆలౌటైంది.


