గువహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. తొలుత బ్యాటింగ్‌లో తేలిపోయిన భారత్.. ఇప్పుడు బ్యాటింగ్‌లో కూడా అదే తీరును కనబరుస్తోంది. 60 ఓవర్లు ముగిసే సరికి 7 వికెట్లు నష్టానికి 163 పరుగులు చేసింది.
123 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును వాషింగ్టన్ సుందర్(25), కుల్దీప్(11) ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఎనిమిదో వికెట్‌కు 37 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇంకా సౌతాఫ్రికా 326 పరుగులు వెనకబడి ఉంది. ఫాల్ అన్ గండం తప్పించుకోవాలంటే మెన్ ఇన్ బ్లూ.. 127 పరుగులు చేయాలి
టాపార్డర్ అట్టర్ ప్లాప్..
9/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ఆరభించిన భారత్‌కు రాహుల్(22), జైశ్వాల్(58) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రాహుల్ ఔటయ్యాక భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. సాయిసుదర్శన్(15), ధ్రువ్ జురెల్(0) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత రిషబ్ పంత్(7), నితీశ్ కుమార్ రెడ్డి(10), జడేజా(6) తీవ్ర నిరాశపరిచారు. ప్రోటీస్ బౌలర్లలో జాన్సెన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. హర్మర్ రెండు,మహారాజ్ ఓవికెట్ సాధించారు. కాగా అంతకుముందు సౌతాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోర్ సాధించింది.


