గువహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా అధిపత్యం కొనసాగుతోంది. 247/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.
రెండో రోజు టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. సెనూరన్ ముత్తుసామి (56 బ్యాటింగ్), కైల్ వెరీన్ (38 బ్యాటింగ్) తమ వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతున్నారు.
వీలు చిక్కినప్పడుల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 70 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఎంతమంది బౌలర్లను మారుస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. తొలి సెషన్‌లో భారత్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది.
తొలి రోజు ఆట మొదటి సెషన్‌లో కూడా సఫారీ బ్యాటర్లు పై చేయి సాధించారు. కానీ సెకెండ్ సెషన్‌లో భారత స్పిన్నర్లు కమ్ బ్యాక్ ఇవ్వడంతో 6 వికెట్లు నేల కూలాయి. ఇప్పుడు రెండో రోజు కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందో లేదో వేచి చూడాలి.
చదవండి: SA vs IND: పంత్, రోహిత్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్!


