breaking news
Senuran Muthusamy
-
చరిత్ర సృష్టించిన యాన్సెన్.. పట్టు బిగించిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం బాదడంతో పాటు.. ఆరు వికెట్లు తీసిన తొలి ప్రొటిస్ ఆటగాడిగా నిలిచాడు. గువాహటి టెస్టు సందర్భంగా యాన్సెన్ ఈ ఘనత సాధించాడు.ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27 (WTC)లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు సౌతాఫ్రికా భారత్ పర్యటనకు వచ్చింది. కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో 30 పరుగుల తేడాతో గెలిచిన సఫారీలు.. రెండో టెస్టులోనూ పట్టు బిగించారు.సెంచరీ.. జస్ట్ మిస్బర్సపరా స్టేడియంలో శనివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది సౌతాఫ్రికా. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌట్ అయింది. ఇందులో టెయిలెండర్లు సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy), మార్కో యాన్సెన్‌లది కీలక పాత్ర. ముత్తుస్వామి శతకం (109)తో సత్తా చాటగా.. యాన్సెన్ (91 బంతుల్లో 93) సెంచరీకి ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.ఆరు వికెట్లు పడగొట్టిఇక ప్రొటిస్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తో చెలరేగిన యాన్సెన్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో బంతితోనూ దుమ్ములేపాడు. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) రూపంలో కీలక బ్యాటర్లను అవుట్ చేశాడు ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.అదే విధంగా.. కుల్దీప్ యాదవ్ (19), జస్ప్రీత్ బుమ్రా (5)లను వెనక్కి పంపి.. భారత జట్టు ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇలా మొత్తంగా ఆరు వికెట్లు కూల్చి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు యాన్సెన్.ఈ క్రమంలోనే పాతికేళ్ల యాన్సెన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియాతో టెస్టు మ్యాచ్‌లో అర్ధ శతకం చేయడంతో పాటు.. ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు కూల్చిన తొలి సౌతాఫ్రికా క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు.. భారత్‌లో టెస్టు మ్యాచ్‌లో అత్యుత్తమ గణాంకాలు (6/48) నమోదు చేసిన విదేశీ లెఫ్టార్మ్ పేసర్ల జాబితాలోనూ యాన్సెన్ చేరాడు.పట్టు బిగించిన సౌతాఫ్రికాటీమిండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన సఫారీలు.. భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్ చేశారు. ఫలితంగా 288 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించారు.ఈ నేపథ్యంలో టీమిండియాను ఫాలో ఆన్ ఆడిస్తారనుకుంటే.. ప్రొటిస్ కెప్టెన్ తెంబా బవుమా ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తామే రెండో ఇన్నింగ్స్ మొదలుపెడతామని చెప్పాడు. ఈ క్రమంలో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్ 13, ఐడెన్ మార్క్రమ్ 12 పరుగులతో క్రీజులో నిలిచారు. ఫలితంగా మూడో రోజు ముగిసేసరికి సౌతాఫ్రికా టీమిండియాపై తొలి ఇన్నింగ్స్‌లో ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యం సంపాదించింది.చదవండి: మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్ -
మరీ ఇంత చెత్తగా ఆడతారా?.. టీమిండియా ఆలౌట్.. ఫ్యాన్స్ ఫైర్
సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా (IND vs SA 2nd Test) చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. గువాహటి వేదికగా తొలుత భారత బౌలర్లు తేలిపోగా.. బ్యాటర్లు కూడా తామేం తక్కువ కాదన్నట్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వెరసి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫాలో ఆన్ ఆడాల్సిన దుస్థితిలో నిలిచింది.అయితే, సఫారీ జట్టు కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) మాత్రం తాము బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకోవడంతో భారత శిబిరం ఊపిరి పీల్చుకుంది. ఫాలో ఆన్ గండం తప్పించుకుంది. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో సౌతాఫ్రికా చేతిలో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శనివారం గువాహటిలో రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ వేదికపై టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.శతక్కొట్టిన ముత్తుస్వామి.. సెంచరీ మిస్ అయిన యాన్సెన్ప్రొటిస్ ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్ (38), ర్యాన్ రికెల్టన్ (35) మెరుగైన ఆరంభం అందించగా.. ట్రిస్టన్ స్టబ్స్ (49), కెప్టెన్ తెంబా బవుమా (41) దానిని కొనసాగించారు. అయితే, ఊహించని రీతిలో సఫారీ స్పిన్నర్ సెనూరన్ ముత్తుస్వామి (Senuran Muthusamy) బ్యాట్‌తో చెలరేగిపోయాడు.భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ 206 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. ముత్తుస్వామి శతకానికి తోడు... వికెట్ కీపర్ బ్యాటర్ కైలీ వెరెన్నె 45 పరుగులతో సత్తా చాటగా.. ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ 91 బంతుల్లోనే 93 పరుగులతో దుమ్ములేపాడు. మిగతా వారిలో టోనీ డి జోర్జి (28) ఫర్వాలేదనిపించాడు. ఫలితంగా సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.జైసూ హాఫ్ సెంచరీభారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (58), కేఎల్ రాహుల్ (22) మెరుగైన ఆరంభమే అందించారు. కానీ మిడిలార్డర్ మాత్రం సఫారీ బౌలర్ల ధాటికి తాళలేక కుప్పకూలింది.అంతా ఫెయిల్.. వాషీ ఒక్కడే..వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీశ్ కుమార్ రెడ్డి (10) దారుణంగా విఫలమయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. యాన్సెన్ మంచి డెలివరీతో అతడిని పెవిలియన్‌కు పంపాడు.ఇక వాషీకి తోడుగా పట్టుదలగా క్రీజులో నిలబడ్డ కుల్దీప్ యాదవ్ (134 బంతుల్లో 19)ను కూడా వెనక్కి పంపిన యాన్సెన్.. బుమ్రా (5)ను కూడా అవుట్ చేసి టీమిండియా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. తొలి ఇన్నింగ్స్‌లో 83.5 ఓవర్లలో టీమిండియా కేవలం 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో యాన్సెన్ ఆరు వికెట్లతో చెలరేగగా.. సైమన్ హార్మర్ మూడు, కేశవ్ మహరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో.. సౌతాఫ్రికా కంటే 288 పరుగులు వెనుకబడి ఉంది. దీంతో అభిమానులు టీమిండియాపై ఫైర్ అవుతున్నారు. ఇంత చెత్త బ్యాటింగ్ ఏంటయ్యా? అంటూ పంత్ సేనపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: IND vs SA: పంత్‌ను కాదని రాహుల్‌కు కెప్టెన్సీ.. కారణమిదే? -
400 పరుగులు దాటిన దక్షిణాఫ్రికా స్కోర్
గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 428 పరుగులు సాధించింది. రెండో రోజు ఆటలో ప్రోటీస్ లోయర్-ఆర్డర్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించారు.ఏడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సెనురన్ ముత్తుసామి(203 బంతుల్లో 107 బ్యాటింగ్) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ముత్తుసామికి ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ కావడం విశేషం. 247/6 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా తొలి సెషన్లో పట్టు బిగించింది. ముత్తుసామి, కైల్ వెర్రెయెన్నె (45) నిలకడగా ఆడి స్కోర్‌ను 300 పరుగులు దాటించారు.టీ బ్రేక్ తర్వాత కైల్ వెర్రెయెన్నె పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మార్కో జాన్సెన్ (51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 57 ) దూకుడుగా ఆడి మూడో టెస్టు హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. జాన్సెన్ భారత స్పిన్నర్లపై సిక్సర్లతో విరుచుకుపడుతున్నాడు. అతడిని ఆపేందుకు బుమ్రాను ఎటాక్‌లోకి తీసుకొచ్చినప్పటి ఫలితం మాత్రం దక్కలేదు. రెండో రోజు ఆటలో రవీంద్ర జడేజా ఒక్కడే వికెట్ సాధించాడు. పిచ్ పూర్తిగా బ్యాటర్లకు అనుకూలంగా మారింది.చదవండి: IND vs SA: కుల్దీప్.. నీకు ఇది రెండో సారి వార్నింగ్? పంత్ సీరియస్ -
భారత్‌తో రెండో టెస్టు.. భారీ స్కోర్ దిశగా సౌతాఫ్రికా
గువహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా అధిపత్యం కొనసాగుతోంది. 247/6 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన దక్షిణాఫ్రికా.. భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.రెండో రోజు టీ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. సెనూరన్ ముత్తుసామి (56 బ్యాటింగ్), కైల్ వెరీన్ (38 బ్యాటింగ్) తమ వికెట్ కోల్పోకుండా ఆచితూచి ఆడుతున్నారు. వీలు చిక్కినప్పడుల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 70 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఎంతమంది బౌలర్లను మారుస్తున్నా ఫలితం మాత్రం దక్కడం లేదు. తొలి సెషన్లో భారత్ ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయింది.తొలి రోజు ఆట మొదటి సెషన్లో కూడా సఫారీ బ్యాటర్లు పై చేయి సాధించారు. కానీ సెకెండ్ సెషన్లో భారత స్పిన్నర్లు కమ్ బ్యాక్ ఇవ్వడంతో 6 వికెట్లు నేల కూలాయి. ఇప్పుడు రెండో రోజు కూడా అదే ఫలితం పునరావృతం అవుతుందో లేదో వేచి చూడాలి.చదవండి: SA vs IND: పంత్, రోహిత్ కాదు.. టీమిండియా కెప్టెన్‌గా స్టార్ ప్లేయర్! -
ప్రతిష్టాత్మక అవార్డు దక్కించుకున్న దక్షిణాఫ్రికా కెప్టెన్
దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డును దక్కించుకుంది. 2025, అక్టోబర్ నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును (ICC Player of the Month) కైవసం చేసుకుంది.అక్టోబర్ నెలలో అత్యుత్తమ ప్రదర్శనలకు గానూ లారాకు ఈ అవార్డు దక్కింది. తాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్-2025లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచిన ఆమె.. అక్టోబర్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు చేసింది. గత నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారీ సెంచరీ (169) చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చింది. ఈ నెలలో భారత్‌తో జరిగిన ఫైనల్లోనూ సెంచరీ చేసింది. లారా సెంచరీతో మెరిసినా సౌతాఫ్రికా ఫైనల్లో భారత్ చేతిలో ఓటమిపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్న తర్వాత లారా మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ప్రపంచకప్ టైటిల్ గెలవలేకపోయినా, మా పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని అంది. ఈ అవార్డు కోసం భారత స్టార్ బ్యాటర్, ప్రపంచకప్ సెకెండ్ లీడింగ్ రన్ స్కోరర్ స్మృతి మంధన, ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ ఆష్లే గార్డ్నర్ పోటీపడినప్పటికీ.. లారానే అదృష్టం వరించింది.పురుషుల విభాగంలో ముత్తుసామిఅక్టోబర్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు పురుషుల విభాగంలోనూ సౌతాఫ్రికన్నే వరించింది. ఆ జట్టు స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. అక్టోబర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్ట్‌ల్లో అతను విశేషంగా రాణించాడు. తొలి టెస్ట్‌లో 11 వికెట్లు, రెండో టెస్ట్‌లో 89 పరుగులు చేశాడు. ఈ సిరీస్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ అవార్డు కోసం ముత్తసామితో పాటు పాకిస్తాన్ స్పిన్నర్ నౌమన్ అలీ, ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పోటీపడ్డారు.ఐసీసీ వెబ్సైట్లో రిజిస్టర్ అయిన అభిమానులు, మాజీ అంతర్జాతీయ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధుల ఓట్ల ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించబడతాయి.చదవండి: ధృవ్ జురెల్ ఆసక్తికర వ్యాఖ్యలు -
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన ముత్తుసామి, రబాడ
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ (Pakistan Vs South Africa) హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 404 పరుగులు చేసి కీలకమైన 71 పరుగుల ఆధిక్యం సాధించింది.ఈ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా టెయిలెండర్లు పాక్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) (89 నాటౌట్), రబాడ (Kagiso Rabada) (71) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరు పదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 98 పరుగులు జోడించారు. అంతకుముందు కేశవ్ మహారాజ్ (30) కూడా పాక్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ముత్తుసామి చివరి వరుస బ్యాటర్లతో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యాన్ని అందించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (76), టోనీ డి జోర్జి (55) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను మంచి పునాది వేశారు.పాక్ బౌలర్లలో అరంగేట్రం స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది 6 వికెట్లతో చెలరేగగా.. నౌమన్ అలీ 2, షాహీన్ అఫ్రిది, సాజిద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (57), షాన్ మసూద్ (87), సౌద్ షకీల్ (66) అర్ద సెంచరీలతో రాణించగా.. సల్మాన్ అఘా (45) పర్వాలేదనిపించాడు. కేశవ్ మహారాజ్ (42.4-5-102-7) అద్బుత ప్రదర్శనతో పాక్ పతనాన్ని శాశించాడు. సైమన్ హార్మర్ 2, రబాడ ఓ వికెట్ తీశారు.కాగా, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.చదవండి: ఆసీస్‌తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి


