పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన ముత్తుసామి, రబాడ | Pakistan vs South Africa 2nd Test: SA take crucial lead | Sakshi
Sakshi News home page

పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించిన ముత్తుసామి, రబాడ

Oct 22 2025 3:15 PM | Updated on Oct 22 2025 3:27 PM

South Africa Got 71 Runs Crucial Lead In 2nd test vs Pakistan

రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ (Pakistan Vs South Africa) హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌట్‌ కాగా.. సౌతాఫ్రికా ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 404 పరుగులు చేసి కీలకమైన 71 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఈ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా టెయిలెండర్లు పాక్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా సెనురన్‌ ముత్తుసామి (Senuran Muthusamy) (89 నాటౌట్‌), రబాడ (Kagiso Rabada) (71) పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరు పదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 98 పరుగులు జోడించారు. అంతకుముందు కేశవ్‌ మహారాజ్‌ (30) కూడా పాక్‌ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. 

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ముత్తుసామి చివరి వరుస బ్యాటర్లతో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యాన్ని అందించాడు. ట్రిస్టన్‌ స్టబ్స్‌ (76), టోనీ డి జోర్జి (55) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను మంచి పునాది వేశారు.

పాక్‌ బౌలర్లలో అరంగేట్రం​ స్పిన్నర్‌ ఆసిఫ్‌ అఫ్రిది 6 వికెట్లతో చెలరేగగా.. నౌమన్‌ అలీ 2, షాహీన్‌ అఫ్రిది, సాజిద్‌ ఖాన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్‌ (57), షాన్‌ మసూద్‌ (87), సౌద్‌ షకీల్‌ (66) అర్ద సెంచరీలతో రాణించగా.. సల్మాన్‌ అఘా (45) పర్వాలేదనిపించాడు. కేశవ్‌ మహారాజ్‌ (42.4-5-102-7) అద్బుత ప్రదర్శనతో పాక్‌ పతనాన్ని శాశించాడు.  సైమన్‌ హార్మర్‌ 2, రబాడ ఓ వికెట్‌ తీశారు.

కాగా, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్‌ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.

చదవండి: ఆసీస్‌తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement