ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో తీవ్రంగా గాయపడిన (పాదం) టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant) మూడు నెలల విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టాడు. సౌతాఫ్రికా-ఏతో (India A vs South Africa A) ఇవాళ (అక్టోబర్ 30) ప్రారంభమైన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ సిరీస్‌లో పంత్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ ఎక్కడా ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున సాయి సుదర్శన్, ఆయుశ్ మాత్రే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ లాంటి అప్ కమింగ్ బ్యాటర్లు బరిలోకి దిగారు.
ఈ పర్యటనలో సౌతాఫ్రికా-ఏ, భారత్-ఏ జట్ల మధ్య 2 అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, 3 అనధికారిక వన్డేలు జరుగనున్నాయి. రెండో టెస్ట్ కూడా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లోనే జరుగనుండగా.. మూడు వన్డేలకు రాజ్‌కోట్ ఆతిథ్యమివ్వనుంది.
తుది జట్లు..
ఇండియా-A: సాయి సుదర్శన్, ఆయుశ్ మాత్రే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బదోని, తనుష్ కోటియన్, అన్షుల్ కాంబోజ్, మానవ్ సుతార్, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్
దక్షిణాఫ్రికా-A: మార్క్వెస్ అకెర్‌మాన్ (సి), జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, జుబేర్ హంజా, రూబిన్ హెర్మాన్, రివాల్డో మూన్‌సామి (w), టియాన్ వాన్ వురెన్, ప్రేనెలాన్ సుబ్రాయెన్, త్షెపో మోరేకి, లూథో సిపమ్లా, ఒకుహ్లే సెలె
చదవండి: మళ్లీ ముంబై ఇండియన్స్‌లోకి పోలార్డ్, పూరన్


