రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్-ఎ బౌలర్లు నిప్పలు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా-ఎ జట్టు.. భారత బౌలర్ల ధాటికి 30.3 ఓవర్లలో కేవలం 132 పరుగులకే కుప్పకూలింది. యువ ఆల్‌రౌండర్ నిశాంత్ సింధు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచాడు.
సింధు తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఈ హర్యానా ఆటగాడు 7 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు హర్షిత్ రాణా మూడు, ప్రసిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు.
సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్‌స్వామి(33) టాప్ స్కోరర్‌గా నిలవగా.. పొటిగిటర్(23), ప్రిటోరియస్(21) రాణించారు. మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. కాగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా-ఎ జట్టును 4 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్ మెన్ ఇన్ బ్లూ 1-0 ఆధిక్యంలో ఉంది.
తుది జట్లు
భారత్
రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి,నిశాంత్ సింధు,హర్షిత్ రాణా, విప్రజ్ నిగమ్,అర్ష్‌దీప్ సింగ్,ప్రసిద్ కృష్ణ
సౌతాఫ్రికా
రివాల్డో మూన్సామి(వికెట్ కీపర్), లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్డాన్ హెర్మాన్, మార్క్వెస్ అకెర్మాన్(కెప్టెన్), సినెథెంబ క్వెషిలే, డయాన్ ఫారెస్టర్, ప్రెనెలన్ సుబ్రాయెన్, లూథో సిపమ్లా, డెలానో పోట్గీటర్, న్కాబయోమ్జి పీటర్, ఒట్నీల్ బార్ట్‌మన్


