కష్టాల్లో టీమిండియా | India A Struggles vs South Africa A in 2nd Unofficial Test as Top Order Collapses Early | Sakshi
Sakshi News home page

కష్టాల్లో టీమిండియా

Nov 6 2025 11:51 AM | Updated on Nov 6 2025 12:28 PM

India A vs South Africa A 2nd Unofficial Test Day 1: Team India in Trouble

దక్షిణాఫ్రికా-ఏతో ఇవాళ (నవంబర్‌ 6) మొదలైన రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో (India A vs South Africa A) భారత-ఏ జట్టు (India A) కష్టాల్లో పడింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగి 59 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఓవర్‌లోనే అభిమన్యు ఈశ్వరన్‌ డకౌటయ్యాడు. ఆతర్వాత 19 పరుగులు చేసి కేఎల్‌ రాహుల్‌ కూడా ఔటయ్యాడు.

17 పరుగులు చేసిన సాయి సుదర్శన్‌ జట్టు స్కోర్‌ 41 పరుగుల వద్ద ఉండగా మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆతర్వాత 5 పరుగులు చేసి దేవ్‌దత్‌ పడిక్కల్‌ కూడా పెవిలియన్‌కు చేరాడు. వాన్‌ వుర్రెన్‌ (2 వికెట్లు), సుబ్రాయెన్‌ (1), మొరేకీ (1) ధాటికి భారత టాపార్డర్‌ పేకమేడలా కూలింది.

లంచ్‌ విరామం సమయానికి టీమిండియా స్కోర్‌ 85/4గా ఉంది. రిషబ్‌ పంత్‌ (23), ధృవ్‌ జురెల్‌ (19) క్రీజ్‌లో ఉన్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 26 పరుగులు జోడించి బ్యాటింగ్‌ను కొనసాగిస్తున్నారు.

పంత్‌పై భారీ అంచనాలు
రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌-ఏ తొలి మ్యాచ్‌ గెలిచిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ (90) ఛేదనలో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ను గెలిపించాడు. ఇవాళ మొదలైన మ్యాచ్‌లో కూడా పంత్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇంగ్లండ్‌లో గాయపడిన తర్వాత పంత్‌ ఆడుతున్న తొలి సిరీస్‌ ఇదే.

బరిలో టీమిండియా స్టార్లు
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ మార్కస్‌ ఆకెర్‌మన్‌ టాస్‌ గెలిచి టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో చాలామంది టీమిండియా స్టార్లు బరిలోకి దిగుతున్నారు.

కేఎల్‌ రాహుల్‌, అభిమన్యు ఈశ్వరన్‌ ఓపెనింగ్‌కు దిగగా.. సాయి సుదర్శన్‌, దేవదత్‌ పడిక్కల్‌, దృవ్‌ జురెల్‌, రిషబ్‌ పంత్‌, హర్ష్‌ దూబే, ఆకాశ్‌దీప్‌, కల్దీప్‌ యాదవ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ ఆతర్వాత స్థానాల్లో రానున్నారు.  

సౌతాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ నేపథ్యంలో ఆ జట్టులో చోటు దక్కిన ఆటగాళ్లకు ప్రాక్టీస్‌ నిమిత్తం ఈ అవకాశం ఇచ్చారు. మరోవైపు దక్షిణాఫ్రికా-ఏ తరఫున ఆ జట్టు టెస్ట్‌ కెప్టెన్‌ టెంబా బవుమా సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగాడు. సౌతాఫ్రికా టెస్ట్‌ జట్టులోకి ప్రెనేలన్‌ సుబ్రాయన్‌ కూడా ఈ మ్యాచ్‌ ఆడుతున్నాడు.

ఇండియా A (ప్లేయింగ్ XI): KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్(w/c), హర్ష్ దూబే, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

దక్షిణాఫ్రికా A (ప్లేయింగ్ XI): జోర్డాన్ హెర్మాన్, లెసెగో సెనోక్వానే, టెంబా బావుమా, జుబేర్ హంజా, మార్క్వెస్ అకెర్‌మాన్ (సి), కానర్ ఎస్టర్‌హుయిజెన్ (w), టియాన్ వాన్ వురెన్, కైల్ సిమండ్స్, ప్రేనెలన్ సుబ్రాయెన్, షెపో మోరేకి, ఒకుహ్లే సెలె

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement