గత ఎడిషన్ ఐపీఎల్ స్టార్లు ఆయుశ్ బదోని, ప్రియాంశ్ ఆర్య లక్కీ ఛాన్స్‌లు కొట్టేశారు. టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా జరిగే వార్మప్ మ్యాచ్‌ల కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యారు. వీరద్దరు ఫిబ్రవరి 2న నవీ ముంబైలో యూఎస్‌తో జరిగే మ్యాచ్‌లో, ఫిబ్రవరి 6న బెంగళూరులో నమీబియాతో జరిగే మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరూ పాల్గొననున్నారు.
ఐపీఎల్‌లో వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడే బదోని (లక్నో), ఆర్య (పంజాబ్) దేశవాలీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ఆడతారు. భారత-ఏ జట్టుకు ఎంపిక కావడంతో వీరిద్దరు ఢిల్లీ రంజీ జట్టు నుంచి విడుదలయ్యారు. బదోని ఢిల్లీ కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.
బదోని, ఆర్య భారత-ఏ జట్టుకు ఎంపిక కావడంతో వారి స్థానాలను ఇతరులతో భర్తీ చేయనున్నారు. బదోని స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఆయుశ్ దోసేజా బాధ్యతలు చేపడతాడు. ప్రస్తుత ఎడిషన్ రంజీ ట్రోఫీలో ఢిల్లీ ఎలైట్ గ్రూప్-డిలో ఆరో స్థానంలో ఉంది.
ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేక, ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇప్పుడు స్టార్ ఆటగాళ్లు బదోని, ఆర్య కూడా దూరం కావడంతో ఆ జట్టు కష్టాలు మరింత ఎక్కువయ్యాయి.
బదోని ఇటీవల జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లో భారత వన్డే జట్టుకు కూడా ఎంపికయ్యాడు. బదోని ఎంపిక అనూహ్యంగా జరిగినప్పటికీ.. అతనికి తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. బదోని 2025 ఐపీఎల్ సీజన్‌లో అంచనాలకు మించి ఆకట్టుకున్నాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో 148.20 స్ట్రయిక్‌రేట్‌తో 329 పరుగులు చేశాడు.
ప్రియాంశ్ ఆర్య విషయానికొస్తే.. ఇతను కూడా గత ఐపీఎల్ ఎడిషన్‌లో చెలరేగిపోయాడు. 166.48 స్ట్రయిక్‌రేట్‌తో 303 పరుగులు చేసి, దూకుడు ప్రదర్శించాడు. తాజాగా ముగిసిన విజయ్ హజారే వన్డే టోర్నీలోనూ ఆర్య ఇదే జోరును కొనసాగించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 344 పరుగులతో సత్తా చాటాడు.
ఇదిలా ఉంటే, ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడనుంది. అది ఫిబ్రవరి 4న నవీ ముంబై వేదికగా సౌతాఫ్రికాతో జరుగనుంది. ఫిబ్రవరి 6న వార్మప్ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 7 నుంచి ప్రపంచకప్ మెయిన్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.
టోర్నీ ఓపెనర్‌లో పాకిస్తాన్, న్యూజిలాండ్ కొలొంబో వేదికగా తలపడతాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను అదే రోజు యూఎస్‌ఏతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడుతుంది.
వార్మప్ మ్యాచ్‌ల షెడ్యూల్..
ఫిబ్రవరి 2
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)
భారత్-ఏ వర్సెస్ యూఎస్‌ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, మధ్యాహ్నం 3 గంటలకు)
కెనడా వర్సెస్ ఇటలీ (చెన్నై, రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 3
శ్రీలంక-ఏ వర్సెస్ ఒమన్ (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)
నెదర్లాండ్స్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం 3 గంటలకు)
నేపాల్ వర్సెస్ యూఏఈ (చెన్నై, సాయంత్రం 5 గంటలకు)
ఫిబ్రవరి 4
నమీబియా వర్సెస్ స్కాట్లాండ్ (బీసీసీఐ గ్రౌండ్, బెంగళూరు, మధ్యాహ్నం ఒంటి గంటలకు)
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, మధ్యాహ్నం 3 గంటలకు)
ఐర్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 5
ఒమన్ వర్సెస్ జింబాబ్వే (కొలొంబో, మధ్యాహ్నం ఒంటి గంటకు)
కెనడా వర్సెస్ నేపాల్ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)
ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ (కొలొంబో, సాయంత్రం 5 గంటలకు)
న్యూజిలాండ్ వర్సెస్ యూఎస్‌ఏ (డీవై పాటిల్ గ్రౌండ్, నవీ ముంబై, రాత్రి 7 గంటలకు)
ఫిబ్రవరి 6
ఇటలీ వర్సెస్ యూఎస్‌ఏ (చెన్నై, మధ్యాహ్నం 3 గంటలకు)
భారత్-ఏ వర్సెస్ నమీబియా (బీసీసీఐ గ్రౌండ్-1, బెంగళూరు, సాయంత్రం 5 గంటలకు)


