మౌంట్ మౌంగానుయ్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో న్యూజిలాండ్ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సఫారీ బౌలర్ల దాటికి బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లు విల్లవిల్లాడారు.
దీంతో న్యూజిలాండ్ 14.3 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. స్టార్ బ్యాటర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. అయితే డెవాన్ కాన్వే(1), టామ్ లాథమ్ వంటి సీనియర్లు ఉన్నప్పటికి తమ మార్క్ చూపించలేకపోయారు.
ప్రోటీస్ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్‌మన్, కేశవ్ మహారాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. మౌంట్ మౌంగానుయ్ వేదికలో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. ఇంతకుముందు ఈ వేదికలో న్యూజిలాండ్‌పై పాకిస్తాన్ 105 పరుగులకు ఆలౌటైంది.
తుది జట్లు
దక్షిణాఫ్రికా: కానర్ ఎస్టర్‌హుయిజెన్(వికెట్ కీపర్), జోర్డాన్ హెర్మాన్, టోనీ డి జోర్జీ, రూబిన్ హెర్మాన్, జాసన్ స్మిత్, డయాన్ ఫారెస్టర్, జార్జ్ లిండే, జెరాల్డ్ కోట్జీ, కేశవ్ మహారాజ్(కెప్టెన్), న్కోబాని మోకోనా, ఓట్నీల్ బార్ట్‌మన్
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టామ్ లాథమ్(వికెట్‌కీపర్), టిమ్ రాబిన్సన్, నిక్ కెల్లీ, బెవాన్ జాకబ్స్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), జకారీ ఫౌల్క్స్, కోల్ మెక్‌కాంచీ, కైల్ జామిసన్, బెన్ సియర్స్
చదవండి: తండ్రి కాబోతున్న టీమిండియా కెప్టెన్


