టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ రెడ్ బాల్ క్రికెట్‌లో తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎకు ప్రాతినిథ్యం వహిస్తున్న జురెల్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు.
ఈ ఉత్తర్‌ప్రదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ 145 బంతుల్లో తన నాలుగవ ఫస్ట్ క్లాస్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 59 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన భారత్‌ను జురెల్ తన విరోచిత శతకంతో ఆదుకున్నాడు. తొలుత పంత్ కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించిన జురెల్.. ఆ తర్వాత లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్‌యాదవ్‌తో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇండియా-ఎ జట్టు 70 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. క్రీజులో జురెల్(102)తో పాటు మహ్మద్ సిరాజ్(11) ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఇప్పటివరకు వాన్ వుర్రెన్ మూడు వికెట్లు పడగొట్టగా.. సుబ్రాయెన్, మొరేకీ తలా రెండు వికెట్లు సాధించారు.
పంత్ రీ ఎంట్రీ..
కాగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో ధ్రువ్ జురెల్ ఉన్నాడు. అయితే రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి రావడంతో జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. అయితే గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో జురెల్ సూపర్ సెంచరీతో అందరని ఆకట్టుకున్నాడు. ఇంతకుముందు కూడా తనకు వచ్చిన అవకాశాలను జురెల్ అందిపుచ్చుకున్నాడు. అతడు పంత్‌కు బ్యాకప్‌గా కొనసాగుతున్నాడు.
చదవండి: IND vs AUS: గంభీర్ పిచ్చి ప్రయోగం.. అట్టర్ ప్లాప్


