ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) మరో కొత్త ప్రయోగానికి తెరలేపాడు. క్వీన్స్ లాండ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో గంభీర్ ఎవరూ ఊహించని విధంగా ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dube)ను మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ తొలి వికెట్‌కు 56 పరుగుల ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్(28) ఓ భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. దీంతో ఫస్ట్ డౌన్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వస్తాడని అంతా భావించారు. కానీ శివమ్ దూబే బ్యాటింగ్‌కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. రెగ్యూలర్‌గా మూడో స్దానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వస్తుంటాడు.
మొన్న సంజూ.. ఇప్పుడు దూబే
కానీ గంభీర్ మాత్రం మూడో స్ధానంలో వెర్వేరు ఆటగాళ్లను పంపి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో సంజూ శాంసన్‌ను సూర్య స్ధానంలో బ్యాటింగ్‌కు పంపారు. కానీ శాంసన్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అట్టర్ ప్లాప్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ పూర్తిగా తుది జట్టులోనే కోల్పోయాడు.
ఇప్పుడు దూబేను టాపర్డర్‌లో ప్రమోట్ చేశాడు. అస్సులు దూబేకు టాపర్డర్‌లో ఆడిన అనుభవం లేదు. అయినప్పటికి దూబేను ఎందుకు ముందు బ్యాటింగ్ పంపారో గంభీర్‌కే తెలియాలి. తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో టీ20లో దూబే ఏకంగా ఎనిమిదో స్ధానంలో బ్యాటింగ్ చేశాడు.
మూడో టీ20లో అయితే దూబేకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు ఏకంగా తొలిసారి ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్ చేసే ఛాన్స్ దూబేకు లభించింది. కానీ గంభీర్ నమ్మకాన్ని దూబే నిలబెట్టుకోలేకపోయాడు. హెడ్‌కోచ్ చేసిన ప్రయోగం విఫలమైంది.
18 బంతులు ఎదుర్కొన్న దూబే కేవలం 22 పరుగులు మాత్రమే చేసి నాథన్ ఎల్లీస్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో గంభీర్‌ను నెటిజన్లు ట్రోలు చేస్తున్నారు. నీవు మారవా? బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు అవసరమా? అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్(46) టాప్ స్కోరర్‌గా నిలవగా..అభిషేక్ శర్మ(28), శివమ్ దూబే(22), సూర్యకుమార్(20), అక్షర్ పటేల్(21) రాణించారు. తిలక్ వర్మ(5), జితేష్ శర్మ(3) మాత్రం తీవ్ర నిరాశపరిచారు.
చదవండి: ‘సాకులు చెబుతారు... కానీ ఏదో ఒకరోజు సెలక్ట్ చేయక తప్పదు’


