ముల్లాన్‌పూర్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టీ20లో తలపడేందుకు టీమిండియా సిద్దమైంది. ఈమ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్ ఆధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. అయితే కటక్‌లో ఆడిన జట్టునే రెండో టీ20కు కూడా భారత్ కొనసాగించే అవకాశముంది.
స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. తొలి టీ20లో ఆడిన జితీశ్ శర్మను వికెట్ కీపర్‌గా కొనసాగించాలని టీమ్ మెనెజ్‌మెంట్ నిర్ణయించినట్లు సమాచారం. కటక్ టీ20లో ఆఖరిలో బ్యాటింగ్‌కు వచ్చిన జితీశ్.. కేవలం 5 బంతుల్లో పది పరుగులు చేశాడు.
అతడిని ఫినిషర్‌గా ఉపయోగించుకోవాలని హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఒకవేళ టాపర్డర్‌లో ఎవరికైనా విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే తప్ప సంజూకు తుది జట్టులో చోటు దక్కడం కష్టం.
ఇక తొలి టీ20లో విఫలమైన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. ఈ మ్యాచ్‌లో రాణించాల్సిన అవసరముంది. సూర్య గత కొంతకాలంగా మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు అతడి ఫామ్ టీమ్ మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. కనీసం ఈ సిరీస్‌లో నైనా సూర్య తన రిథమ్‌ను తిరిగి అందుకోవాలని ఆశిస్తున్నారు. ఇక తొలి టీ20లో ఘోర ఓటమి చవిచూసిన పలు మార్పులు చేసే అవకాశముంది.
తుది జట్లు(అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, ఎన్రిచ్ నోర్ట్జే, లుంగి ఎన్గిడి, కేశవ్ మహారాజ్/జార్జ్ లిండే, లుథో సిపమ్లా.


