వన్డే ప్రపంచకప్ గెలిచాక ఆడుతున్న తొలి మ్యాచ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు సత్తా చాటింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో ఇవాళ (డిసెంబర్ 21) జరుగుతున్న తొలి టీ20లో భారత బౌలర్లు చెలరేగిపోయారు. విశాఖ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా ప్రత్యర్ధిని 121 పరుగులకే పరిమితం చేసింది (6 వికెట్ల నష్టానికి).
దీప్తి శర్మ (4-1-20-1) పొదుపుగా బౌలింగ్ చేసి లంక బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టింది. అరంగేట్రం బౌలర్ వైష్ణవి శర్మ (4-0-16-0) అంచనాలకు తగ్గట్టుగా రాణించి శభాష్ అనిపించింది. మరో బౌలర్ అరుంధతి రెడ్డి (4-0-23-0) కూడా పర్వాలేదనిపించింది. శ్రీచరణి (4-0-30-1), క్రాంతి గౌడ్ (3-0-23-1) కూడా రాణించారు.
భారత బౌలర్ల ధాటికి లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. 39 పరుగులు చేసిన విష్మి గౌతమ్ టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈమె కాకుండా కెప్టెన్ చమారి (15), హాసిని పెరీరా (20), హర్షిత సమరవిక్రమ (21) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు కూడా అద్బుతమైన ప్రదర్శన చేశారు. నిలాక్షి డిసిల్వ (8), కవిష దిల్హరిని (6) రనౌట్ చేశారు.
తుది జట్లు..
శ్రీలంక: విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(కెప్టెన్), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(వికెట్‌కీపర్), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనై
టీమిండియా: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్‌కీపర్), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి


