సర్వీసెస్‌ సూపర్‌... | Services team emerges champions in prestigious Santosh Trophy | Sakshi
Sakshi News home page

సర్వీసెస్‌ సూపర్‌...

Feb 9 2026 2:47 AM | Updated on Feb 9 2026 2:47 AM

Services team emerges champions in prestigious Santosh Trophy

ఎనిమిదోసారి సంతోష్‌ ట్రోఫీ కైవసం

ఫైనల్లో 1–0తో కేరళపై విజయం 

గువాహటి: జాతీయ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రతిష్టాత్మక సంతోష్‌ ట్రోఫీలో సర్వీసెస్‌ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సర్వీసెస్‌ 1–0 గోల్స్‌ తేడాతో కేరళపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. సంతోష్‌ ట్రోఫీలో సర్వీసెస్‌ జట్టు విజేతగా నిలవడం ఇది ఎనిమిదోసారి కావడం విశేషం. సర్వీసెస్‌ స్ట్రయికర్‌ అభిõÙక్‌ పవార్‌ (109వ నిమిషంలో) మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ చేశాడు. నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లగా... అందులో సర్వీసెస్‌ సత్తా చాటింది. 

2012–13లోనూ ఈ రెండు జట్ల మధ్యే సంతోష్‌ ట్రోఫీ ఫైనల్‌ జరగగా... అప్పుడు కూడా సర్వీసెస్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లోనూ నిర్ణీత సమయంలో గోల్స్‌ నమోదు కాకపోగా... పెనాల్టీ షూటౌట్‌లో ఫలితం తేలింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య జరిగిన ఫైనల్లో అలాంటి ప్రదర్శనే పునరావృతం అయింది. అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణి అవలంభించాయి. 

కేరళ జట్టు కొన్ని ప్రయత్నాలు చేసినా... సర్వీసెస్‌ గోల్‌కీపర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ వాటిని చక్కగా అడ్డుకున్నాడు. అదనపు సమయంలో అభిõÙక్‌ గోల్‌తో సర్వీసెస్‌ ఖాతా తెరవగా... ఆఖర్లో స్కోరు సమం చేసేందుకు కేరళ ఎంత ప్రయతి్నంచినా ఫలితం లేకపోయింది. గ్రూప్‌ దశలోనూ ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిõÙక్‌ ఏకైక గోల్‌ చేసి సర్వీసెస్‌ను గెలిపించగా... ఇప్పుడూ అదే సీన్‌ రిపీట్‌ చేశాడు.  

Advertisement
 
Advertisement
Advertisement