భారత్‌ డబుల్‌ ధమాకా | Two gold medals for india in the Asian Lacrosse Tournament | Sakshi
Sakshi News home page

భారత్‌ డబుల్‌ ధమాకా

Feb 9 2026 2:44 AM | Updated on Feb 9 2026 2:44 AM

Two gold medals for india in the Asian Lacrosse Tournament

ఆసియా లాక్రోస్‌ టోర్నీలో రెండు స్వర్ణాలు

భారత పురుషుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన తెలంగాణ ప్లేయర్‌ అనుదీప్‌ రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: లాస్‌ ఏంజెలిస్‌ 2028 ఒలింపిక్స్‌ క్రీడల్లో చోటు సంపాదించిన లాక్రోస్‌ క్రీడలో భారత్‌ తమ సత్తా చాటుకుంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో అటు పురుషుల విభాగంలో, ఇటు మహిళల విభాగంలో విజేతగా నిలిచి ‘డబుల్‌ ధమాకా’ సృష్టించింది. సౌదీ అరేబియాలోని రియాద్‌ ఆసియా లాక్రోస్‌ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. 

తెలంగాణకు చెందిన అనుదీప్‌ రెడ్డి నాయకత్వంలో భారత పురుషుల జట్టు 9–2 స్కోరుతో ఇరాక్‌ జట్టును ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. అనుదీప్‌ రెడ్డి నాయకత్వ పటిమతో భారత జట్టు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా అజేయంగా నిలిచింది. మరోవైపు భారత మహిళల జట్టు ఫైనల్లో 22–5తో పాకిస్తాన్‌పై గెలిచి బంగారు పతకాన్ని దక్కించుకుంది.   

Advertisement
 
Advertisement
Advertisement