వినువీథిలో సారథులు | over 3,300 active women pilots are flying in India | Sakshi
Sakshi News home page

వినువీథిలో సారథులు

Feb 8 2026 4:00 AM | Updated on Feb 8 2026 4:00 AM

over 3,300 active women pilots are flying in India

ప్రపంచంలోనే అధిక శాతం మహిళా పైలట్లు ఉన్న దేశంగా భారత్‌ మారుతోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, నిబంధనల సరళీకరణ మన దేశాన్ని మహిళా పైలట్ల హబ్‌గా మార్చాయి. విమానయాన రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వేసిన అడుగులే భారత్‌ను నేడు ప్రపంచానికి ఆదర్శంగానిలబెట్టాయి.

ఇటీవల పార్లమెంటులో ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం..
→ 2021 నుంచి 2025 మధ్యకాలంలో మహిళా పైలట్ల సంఖ్య 90% మేర పెరిగింది. ఇది కేవలం ఒక గణాంకం మాత్రమే కాదు, భారతీయ మహిళల ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. 

→ 2021లో మహిళలకు 243 లైసెన్సులు జారీ చేయగా, 2025 నాటికి ఆ సంఖ్య 461కి పెరిగింది. అంటే ఈ నాలుగేళ్లలో సుమారుగా 89.71% వృద్ధిని సూచిస్తోంది. 

→ డిసెంబర్‌ 31, 2025 నాటికి భారతదేశంలో మొత్తం మహిళా పైలట్ల సంఖ్య 3,327.

→ ప్రపంచవ్యాప్తంగా మహిళా పైలట్ల సగటు కేవలం 5% నుంచి 6% మాత్రమే ఉండగా, భారతదేశంలో ఇది 15% గా ఉంది. అంటే ప్రపంచ సగటు (5%) కంటే మూడు రెట్లు ఎక్కువ. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల కంటే కూడా భారత్‌ ఈ విషయంలో ఎంతో ముందుంది.

→ ఒక్క ఏడాదిలోనే అంటే 2025 లో ఫ్లైట్‌ ట్రైనింగ్‌ ఆర్గనైజేషన్లు 61 కొత్త శిక్షణ  విమానాలను ప్రవేశపెట్టడం విమానయాన రంగంలో ఒక పెద్ద అడుగు. ప్రస్తుతం దేశంలో మొత్తం 385 శిక్షణ విమానాలు ఉన్నాయి.

→ సాంకేతిక విభాగాల్లోనూ మహిళల ప్రాధాన్యత పెరుగుతోంది. గ్రౌండ్‌ స్టాఫ్, క్యాబిన్‌ క్రూ విభాగాల్లో మహిళల వాటా 14% వరకు ఉంది.

→ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్‌లో మహిళల సంఖ్య సుమారు 2.6% మాత్రమే ఉన్నప్పటికీ, ఇటీవల ఇండిగో వంటి సంస్థలు కేవలం మహిళలతో కూడిన మెయింటెనెన్స్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాయి.

→ 2025 నాటికి విమానయాన రంగంలో మహిళల వాటాను 25 శాతానికి  పెంచాలని పౌర విమానయాన నియంత్రణ సంస్థ (డిజిసిఏ) లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మహిళలకు ప్రత్యేక హ్యూమన్‌ రిసోర్స్‌ పాలసీలు, ప్రసూతి సెలవులు, శిక్షణ తర్వాత తిరిగి విధుల్లో చేరేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని నిర్ణయించింది.

అంతర్జాతీయంగానూ..
చాలా మంది భారతీయ మహిళా పైలట్లు ఇప్పుడు అంతర్జాతీయ రూట్లలో కూడా విమానాలను నడుపుతున్నారు. దీనివల్ల రాబోయే కాలంలో విమానయాన రంగంలో మహిళలు మరింత ఎత్తుకు ఎదగనున్నారు.
 
పలు ఎయిర్‌లైన్స్లో మహిళా పైలట్ల శాతం 
అలయన్స్‌ ఎయిర్‌... 
అత్యధికంగా 17.36% మంది మహిళా పైలట్లు ఉన్నారు.

ఇండిగో... 
గరిష్ట సంఖ్యలో మహిళా పైలట్లను (సుమారు 791 మంది) కలిగి ఉన్న సంస్థ.

స్పైస్‌జెట్‌... 
16.39% మహిళాపైలట్లతో రెండోస్థానంలో ఉంది.

ఎయిర్‌ ఇండియా... 
15.62% మహిళా పైలట్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement