అదే.. నా బ్యూటీ వెపన్‌! | Sara Arjun new fashion look | Sakshi
Sakshi News home page

అదే.. నా బ్యూటీ వెపన్‌!

Feb 8 2026 2:30 AM | Updated on Feb 8 2026 11:57 AM

Sara Arjun new fashion look

బాల నటిగా మొదలైన ప్రయాణం నుంచి, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తిత్వం వరకు ఆమె ఫ్యాషన్  ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది. సంప్రదాయానికి గర్వంగా నిలుస్తూనే, ఆధునిక ప్రయోగాలు చేసే ఆమె స్టయిల్, బ్యూటీ ఫిలాసఫీ ఇదిగో!

చీర.. బ్రాండ్‌: స్వాతికపూర్‌ లెహంగా ధర రూ. 47,700
బ్లౌజ్‌ ధర రూ. 14,310
ఓణీ ధర రూ. 21,200

జ్యూలరీ బ్రాండ్‌: ఆమ్రపాలి జ్యూవెల్స్‌
ధర: డిజైన్‌ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

కళ్ల అందాన్ని హైలైట్‌ చేయడానికి బ్లాక్‌ కాజల్‌ కంటే బ్రౌన్  కాజల్‌ నా సీక్రెట్‌ బ్యూటీ వెపన్ . దాన్ని స్వల్పంగా స్మడ్జ్‌ చేస్తే కళ్లకు సాఫ్ట్, మేజికల్‌ లుక్‌ వస్తుంది. ఫ్యాషన్ లో మాత్రం నేను సేఫ్‌ గేమ్‌ ఆడను. సంప్రదాయ దుస్తులు, చీరలు, అనార్కలీలు లాంటి క్లాసిక్‌ వేర్‌ను ఫ్యూచరిస్టిక్‌ ఔట్‌ఫిట్స్‌గా మలచుకుంటూ, మైథాలజీకి మోడ్రన్  టచ్‌ ఇచ్చే స్టయిల్‌ను ఫాలో అవుతాను. – సారా అర్జున్‌

Advertisement
 
Advertisement
Advertisement