టీమిండియాకు భారీ షాక్‌ | Jasprit Bumrah Ruled Out Of India vs Sri Lanka Test Series | Sakshi
Sakshi News home page

టీమిండియాకు భారీ షాక్‌

Aug 2 2026 1:55 PM | Updated on Aug 2 2026 3:03 PM

Jasprit Bumrah Ruled Out Of India vs Sri Lanka Test Series

source: X

శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఈ సిరీస్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. తొలుత బుమ్రా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడని ప్రచారం జరిగినప్పటికీ.. అది నిజం కాదని సమాచారం​.

బుమ్రా ఇటీవల బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ (CoE)కు చేరుకున్నాడు. అక్కడ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో మోకాలిలో మరోసారి అసౌకర్యం ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం.

గాయం పూర్తిగా తగ్గకముందే బుమ్రాను బరిలోకి దింపితే సమస్య మళ్లీ తిరగబడే ప్రమాదం ఉందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే అతడిని తొందరపెట్టకుండా విశ్రాంతి, పునరావాసానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రత్యామ్నాయంపై ఇంకా స్పష్టత లేదు
బుమ్రా స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. బీసీసీఐ కూడా ఇప్పటివరకు బుమ్రా గైర్హాజరీపై అధికారికంగా స్పందించలేదు.

శ్రీలంకతో తొలి టెస్టు ఆగస్టు 15న ప్రారంభం కానుండటంతో, బుమ్రా లేకపోవడం భారత పేస్‌ బౌలింగ్‌ విభాగానికి పెద్ద ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement