భార‌త్‌పై సౌతాఫ్రికా పేస‌ర్ అరుదైన రికార్డు | Lungi Ngidi Becomes The First Bowler To Bowl A Boundary Less Spell Against India In T20 World Cup History | Sakshi
Sakshi News home page

T20 WC 2026: భార‌త్‌పై సౌతాఫ్రికా పేస‌ర్ అరుదైన రికార్డు

Feb 23 2026 4:08 PM | Updated on Feb 23 2026 4:37 PM

Lungi Ngidi Becomes The 1st Ever Bowler To Do This vs India

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026లో సౌతాఫ్రికా త‌మ జైత్ర యాత్ర‌ను కొన‌సాగిస్తోంది. ఆదివారం అహ్మదాబాద్ వేదిక‌గా జ‌రిగిన సూప‌ర్‌-8 మ్యాచ్‌లో 76 ప‌రుగుల తేడాతో భార‌త్‌ను ప్రోటీస్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టింది.

తొలుత బ్యాటింగ్‌లో 187 ప‌రుగులు భారీ స్కోర్ చేసిన ద‌క్షిణాఫ్రికా, అనంత‌రం బౌలింగ్‌లోనూ అద‌ర‌గొట్టింది. మార్కో జాన్సెన్ నాలుగు, కేశ‌వ్ మ‌హారాజ్ మూడు వికెట్లు ప‌డ‌గొట్టి టీమిండియా ప‌తనాన్ని శాసించారు. లుంగీ ఎంగిడీ కూడా అద్బుతమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

ఎంగిడీ తన 4 ఓవర్ల కోటాలో వికెట్లేమీ తీయకపోయినా,  కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి భారత బ్యాటర్లను కట్టడి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎంగిడీ ఒక్క బౌండ‌రీ కూడా ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా ఈ స‌ఫారీ స్పీడ్ స్టార్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. 

భార‌త్‌పై టీ20ల్లో ఒక పేసర్ బౌండరీ ఇవ్వకుండా నాలుగు ఓవర్లు వేయడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. 2019లో బెంగళూరు వేదిక‌గా భార‌త్ జ‌రిగిన టీ20 మ్యాచ్‌లో స‌ఫారీ ఫాస్ట్ బౌల‌ర్ బ్యూరాన్ హెండ్రిక్స్ బౌండ‌రీ ఏమీ ఇవ్వ‌కుండా త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాను పూర్తి చేశాడు. అయితే అప్పుడు హెండ్రిక్స్ 14 ప‌రుగులు ఇవ్వ‌గా.. ఎంగిడీ ఇప్పుడు 15 పరుగులు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement