IPL 2026: కేకేఆర్‌ హెడ్‌కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌!? | IPL 2026: Is KKR To Replace Chandrakant Pandit with Eoin Morgan as Head Coach | Sakshi
Sakshi News home page

IPL 2026: చంద్రకాంత్‌కు గుడ్‌బై.. కేకేఆర్‌ హెడ్‌కోచ్‌గా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌!?

Jul 30 2025 12:38 PM | Updated on Jul 30 2025 12:54 PM

IPL 2026: Is KKR To Replace Chandrakant Pandit with Eoin Morgan as Head Coach

చంద్రకాంత్‌ పండిట్‌ (PC: KKR)

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) మాజీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) జట్టుకు కొత్త హెడ్‌కోచ్‌ రాబోతున్నాడు. ఇందుకోసం యాజమాన్యం ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కేకేఆర్‌ ప్రధాన కోచ్‌గా పనిచేసిన‌ చంద్రకాంత్‌ పండిత్‌ శిక్షణ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.

ఆయన సేవలు వెలకట్టలేనివి
రెండేళ్లుగా కేకేఆర్‌తో ప్రయాణం చేసిన చంద్రకాంత్‌... ఇకపై కొనసాగబోవడం లేదని ఫ్రాంచైజీ యాజమాన్యం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌ చంద్రకాంత్‌ పండిత్‌ కొత్త అవకాశాలను అన్వేషించుకోవాలని నిర్ణయించుకున్నారు. 

ఫ్రాంచైజీ హెడ్‌ కోచ్‌గా కొనసాగాలనుకోవడం లేదు. రెండేళ్లుగా జట్టుకు ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. 2024లో కోల్‌కతా చాంపియన్‌గా నిలవడంలో చంద్రకాంత్‌ కీలక పాత్ర పోషించారు.

క్రమశిక్షణ, అంకితభావంతో బలమైన జట్టును రూపొందించారు. జట్టుపై ఆయన ప్రభావం ఎంతగానో ఉంది. భవిష్యత్తులోనూ ఆయన విజయవంతం కావాలని ఆశిస్తున్నాం’ అని ఫ్రాంచైజీ ప్రకటనలో పేర్కొంది.

గతేడాది టైటిల్‌.. ఈసారి పేలవ ప్రదర్శన
కాగా కోచింగ్‌లో అపార అనుభవం ఉన్న చంద్రకాంత్‌ శిక్షణలో కేకేఆర్‌ జట్టు 2024లో మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీ చేజిక్కించుకుంది. అయితే ఈ ఏడాది డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా... స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమైంది. లీగ్ దశలో పద్నాలుగు‌ మ్యాచ్‌లలో కేవలం ఐదింట మాత్రమే నెగ్గి పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.

ఇక ఐపీఎల్‌లో కేకేఆర్‌కు ఇదే పేలవ ప్రదర్శన కాగా... ఈ సీజన్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే ‘ప్లే ఆఫ్స్‌’ రేసుకు దూరమై నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్‌ జట్టును వీడటం గమనార్హం.

కాగా దేశవాళీల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రకాంత్‌ పండిత్‌... 2023 ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభానికి ముందు కేకేఆర్‌ జట్టుతో చేరారు. కాగా ఆ ఏడాది ఏడో స్థానంలో నిలిచిన కోల్‌కతా... తర్వాతి సంవత్సరం ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. 2024లో ఐపీఎల్‌ ట్రోఫీతో పాటు లీగ్‌ చరిత్రలో అత్యధిక పాయింట్లు, అత్యుత్తమ రన్‌రేట్‌ సైతం కేకేఆర్‌ నమోదు చేసుకుంది.  

హెడ్‌కోచ్‌గా ఇయాన్‌ మోర్గాన్‌?
ఇక చంద్రకాంత్‌ పండిట్‌ నిష్క్రమణ నేపథ్యంలో కేకేఆర్‌  తమ మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ను హెడ్‌కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. 2020, 2021 సీజన్లలో మోర్గాన్‌ కేకేఆర్‌ సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలో కోల్‌కతా జట్టు 24 మ్యాచ్‌లకు గానూ పదకొండు గెలిచింది.

ఇదిలా ఉంటే.. చంద్రకాంత్‌ పండిట్‌తో పాటు బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌ కూడా కేకేఆర్‌ను వీడనున్నట్లు సమాచారం. త్వరలోనే అతడు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జట్టుకట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. 

అయితే, గతేడాది జట్టును చాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను వదులుకున్న కేకేఆర్‌.. తాజాగా హెడ్‌కోచ్‌కు కూడా ఉద్వాసన పలికింది. ఇక శ్రేయస్‌ను పంజాబ్‌ కింగ్స్‌ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేయగా.. ఐపీఎల్‌-2025లో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. మరోవైపు.. కేకేఆర్‌ అజింక్య రహానేను తమ కెప్టెన్‌గా నియమించుకోగా పేలవ ప్రదర్శనతో కనీసం ప్లే ఆఫ్స్‌ చేరకుండా నిష్క్రమించింది.

ఐపీఎల్‌-2025లో కేకేఆర్‌ కోచింగ్‌ సిబ్బంది వీరే
👉మెంటార్‌: డ్వేన్‌ బ్రావో
👉హెడ్‌కోచ్‌: చంద్రకాంత్‌ పండిత్‌
👉బౌలింగ్‌ కోచ్‌: భరత్‌ అరుణ్‌
👉స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌: కార్ల్‌ క్రోవ్‌
👉ఫిజియోథెరపిస్ట్‌: ప్రశాంత్‌ పంచాడ
👉స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌: క్రిస్‌ డొనాల్డ్‌సన్‌
👉టీమ్‌ మేనేజర్‌: అడ్రియాన్‌ వాన్‌ బెంట్లీ.

చదవండి: WCL 2025: స్టువర్ట్‌ బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్‌ మెరుపులు.. సెమీస్‌లో ఇండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement