కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియ‌న్స్‌.. | IPL 2025: Mumbai Indians vs Kolkata Knight Riders Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

IPL 2025: కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియ‌న్స్‌..

Mar 31 2025 7:16 PM | Updated on Mar 31 2025 10:27 PM

IPL 2025: Mumbai Indians vs Kolkata Knight Riders Live Updates And Highlights

MI vs KKR live Updates And highlights: ఐపీఎల్‌-2025లో వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా ముంబై ఇండియన్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియ‌న్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.

కేకేఆర్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియ‌న్స్‌..
ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియ‌న్స్ బోణీ కొట్టింది. వాఖండే వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ముంబై ఘ‌న విజ‌యం సాధించింది. 117 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ముంబై ఇండియ‌న్స్ కేవ‌లం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 12.5 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. ముంబై బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ ర్యాన్ రికెల్ట‌న్‌(40 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 62 నాటౌట్‌) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఆఖ‌రిలో సూర్య‌కుమార్ యాద‌వ్‌(7 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల‌తో 27) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.

దూకుడుగా ఆడుతున్న రికెల్ట‌న్‌
10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ వికెట్ న‌ష్టానికి 73 ప‌రుగులు చేసింది. క్రీజులో ర్యాన్ రికెల్ట‌న్‌(45), విల్ జాక్స్‌(12) ఉన్నారు.

ముంబై ఇండియన్స్ తొలి వికెట్ డౌన్‌..
రోహిత్ శర్మ రూపంలో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.  6 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ న‌ష్టానికి 55 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్‌(31), విల్ జాక్స్(8) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న ముంబై ఓపెనర్లు
ముంబై ఇండియన్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి ముంబై వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసింది. క్రీజులో రికెల్టన్‌(29), రోహిత్ శర్మ(13) ఉన్నారు.

2 ఓవ‌ర్లకు ముంబై స్కోర్‌: 15/0
2 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ముంబై ఇండియ‌న్స్ వికెట్ న‌ష్ట‌పోకుండా 15 ప‌రుగులు చేసింది. క్రీజులో రోహిత్ శ‌ర్మ‌(12), రికెల్ట‌న్‌(1) ఉన్నారు.

116 పరుగులకే 10 వికెట్లు..
16.2 ఓవర్‌లో శాంట్నర్‌ బౌలింగ్‌లో రమణ్‌ దీప్‌ సింగ్‌ వికెట్‌ కోల్పోయాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్‌ 117పరుగులు చేయాల్సి ఉంది.  
97 పరుగులకే 9 వికెట్లు.. హర్షిత్‌ రాణా ఔట్‌
97 పరుగుల వద్ద  కేకేఆర్‌ తన తొమ్మిదవ వికెట్‌ను కోల్పోయింది.  హర్షిత్‌ రాణా (4) పరుగులకే ఔటయ్యాడు. విఘ్నేష్‌ వేసిన 14వ ఓవర్‌లో పెవీలియన్‌ బాట పట్టాడు. 

 88 పరుగులకే 8 వికెట్లు.. రసెల్‌ ఔట్‌
88 పరుగుల వద్ద కేకేఆర్‌ తన ఎనిమిదో వికెట్‌ ను కోల్పోయింది. రసెల్‌(5) ఔటయ్యాడు. అశ్వనీ కుమార్‌ వేసిన 13 ఓవర్‌ లో రసెల్‌ పెవిలియన్‌ చేరాడు. అశ్వనీ కుమార్‌ వేసిన ఆ ఓవర్‌ నాల్గో బంతికి రసెల్‌ బౌల్డ్‌ అయ్యాడు.

80 పరుగులకే  7 వికెట్లు.. పీకల్లోతు కష్టాల్లో కేకేఆర్‌
రింకూ సింగ్‌(17), మనీష్‌ పాండే(19)లు వరుసగా పెవిలియన్‌ చేరారు. అశ్వనీ కుమార్‌ వేసిన 11 ఓవర్‌ లో వీరిద్దరూ పెవిలియన్‌ చేరారు. 11  ఓవర్‌ మూడో బంతికి రింకూ సింగ్‌ అవుట్‌ కాగా,  ఆ ఓవర్‌ చివరి బంతికి పాండే పెవిలియన్‌ చేరాడు.

క‌ష్టాల్లో కేకేఆర్‌.. 45 ప‌రుగుల‌కే 5 వికెట్లు 
ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్లు నిప్పులు చేరుగుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌.. 45 ప‌రుగులకే 5 వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ర‌ఘువంశీ(26) రూపంలో కేకేఆర్ ఐదో వికెట్ కోల్పోయింది.
కేకేఆర్ మూడో వికెట్ డౌన్‌..
ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్లు నిప్పులు చేరుగుతున్నారు. అజింక్య ర‌హానే రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 11 ప‌రుగులు చేసిన ర‌హానే.. అశ్వని కుమార్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ మూడు వికెట్ల న‌ష్టానికి 33 ప‌రుగులు చేసింది.

కేకేఆర్ రెండో వికెట్ డౌన్‌..
క్వింట‌న్ డికాక్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన డికాక్‌.. దీప‌క్ చాహ‌ర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ 26 ప‌రుగులు చేసింది.  క్రీజులోకి ర‌ఘువ‌న్షి(9), అజింక్య ర‌హానే(12) ఉన్నారు.

కేకేఆర్ తొలి వికెట్ డౌన్‌.. 
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే బిగ్‌షాక్ త‌గిలింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో సునీల్ నరైన్‌.. ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి అజింక్య ర‌హానే వ‌చ్చాడు.

తుది జ‌ట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్‌), రింకు సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement