
Photo Courtesy: BCCI
ఉత్కంఠ పోరులో కేకేఆర్ ఓటమి..
ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై 4 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేయగల్గింది. కేకేఆర్ బ్యాటర్లలో అజింక్య రహానే(61) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రింకూ సింగ్(38), వెంకటేశ్ అయ్యర్(45), సునీల్ నరైన్(30) పోరాడారు. లక్నో బౌలర్లలో ఆకాష్ దీప్, శార్ధూల్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. అవేష్ ఖాన్,బిష్ణోయ్, దిగ్వేష్ తలా వికెట్ సాధించారు.
రసవత్తరంగా కేకేఆర్-లక్నో మ్యాచ్
ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో-కేకేఆర్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కేకేఆర్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 24 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్(24), హర్షిత్ రానా(5) ఉన్నారు.
కేకేఆర్ ఆరో వికెట్ డౌన్..
వెంకటేశ్ అయ్యర్ రూపంలో కేకేఆర్ ఆరో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన అయ్యర్.. ఆకాష్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి రింకూ సింగ్ వచ్చాడు. 16 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 185/6గా ఉంది.
ఐదో వికెట్ కోల్పోయిన కేకేఆర్
త్వరగా లక్ష్యాన్ని చేరుకుందామనే తొందరలో కేకేఆర్ వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆ జట్టు 173 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి రఘువంశీ (5) ఔటయ్యాడు. 15 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 173/5గా ఉంది.
నాలుగో వికెట్ కోల్పోయిన కేకేఆర్
13.6వ ఓవర్- 166 పరుగుల వద్ద రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో మార్క్రమ్‌కు క్యాచ్ ఇచ్చి రమన్‌దీప్ సింగ్ (1) ఔటయ్యాడు.
మూడో వికెట్ కోల్పోయిన కేకేఆర్
ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో వరుసగా ఐదు వైడ్లు వేసిన శార్దూల్ ఠాకూర్ ఆ ఓవర్ చివరి బంతికి అతి కీలకమైన రహానే (61) వికెట్ తీశాడు. 13 ఓవర్ల తర్వాత కేకేఆర్ స్కోర్ 162/3గా ఉంది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ గెలవాలంటే 42 బంతుల్లో మరో 77 పరుగులు మాత్రమే చేయాలి. వాతావరణం బౌలర్లకు ఏమాత్రం సహకరించడం లేదు. బంతి అస్సలు నియంత్రణలో ఉండటం లేదు.
టార్గెట్ 239.. 10 ఓవర్లలో 129 పరుగులు చేసిన కేకేఆర్
239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ కూడా ధీటుగా జవాబిస్తుంది. 10 ఓవర్లలోనే ఆ జట్టు 129 పరుగులు (2 వికెట్ల నష్టానికి) చేసింది. రహానే (47), వెంకటేశ్ అయ్యర్ (24) క్రీజ్‌లో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్
6.2వ ఓవర్- పవర్ ప్లేలో అదరగొట్టిన కేకేఆర్ (90/1) ఆతర్వాతి ఓవర్‌లోనే వికెట్ కోల్పోయింది. దిగ్వేష్ రాఠీ సునీల్ నరైన్‌ను (30) బోల్తా కొట్టించాడు. రహానేకు (36) జతగా వెంకటేశ్ అయ్యర్ క్రీజ్‌లోకి వచ్చాడు.
టార్గెట్ 239.. విధ్వంసం సృష్టిస్తున్న కేకేఆర్ బ్యాటర్లు
భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. ఆదిలోనే డికాక్ వికెట్ కోల్పోయినప్పటికీ.. సునీల్ నరైన్ (30), రహానే (18) విధ్వంసం సృష్టిస్తున్నారు. వీరిద్దరి ధాటికి కేకేఆర్ 5 ఓవర్లలో ఏకంగా 73 పరుగులు చేసింది.
టార్గెట్ 239.. తొలి వికెట్ కోల్పోయిన కేకేఆర్
2.3వ ఓవర్- 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేకేఆర్ 37 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. తొలి ఓవర్‌లో 16 పరుగులిచ్చిన ఆకాశ్‌దీప్ అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చి డికాక్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. సునీల్ నరైన్‌కు (15) జతగా రహానే క్రీజ్‌లోకి వచ్చాడు.
మార్ష్, పూరన్ విధ్వంసం.. లక్నో భారీ స్కోర్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో భారీ స్కోర్ చేసింది. మార్ష్ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), పూరన్ (36 బంతుల్లో 87 నాటౌట్; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. లక్నో ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా సత్తా చాటాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 2, రసెల్ ఓ వికెట్ తీశారు.
21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన పూరన్
పూరన్ 21 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 16.4 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 192/2గా ఉంది. పూరన్‌తో పాటు అబ్దుల్ సమద్ (2) క్రీజ్‌లో ఉన్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన లక్నో.. మార్ష్ ఔట్
15.2వ ఓవర్- 81 పరుగుల వద్ద మిచెల్ మార్ష్ ఔటయ్యాడు. రసెల్ బౌలింగ్‌లో రింకూ సింగ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
సెంచరీకి చేరువవుతున్న మార్ష్
15 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 170/1గా ఉంది. మార్ష్ (47 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీకి చేరువవుతున్నాడు. మరో ఎండ్‌లో పూరన్ కూడా ధాటిగా ఆడుతున్నాడు. పూరన్ 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 32 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నాడు.
దంచి కొడుతున్న మార్ష్
హాఫ్ సెంచరీ పూర్తయ్యాక మార్ష్ మరింత స్పీడ్ పెంచాడు. వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతున్నాడు. 13 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 138/1గా ఉంది. మార్ష్ 42 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 71 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. పూరన్ 8 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 12 పరుగులు చేసి మార్ష్‌కు జతగా ఉన్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన లక్నో
10.2వ ఓవర్- 99 పరుగుల వద్ద లక్నో తొలి వికెట్ కోల్పోయింది. 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేసి మార్క్రమ్ ఔటయ్యాడు. హర్షిత్ రాణా మార్క్రమ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మిచెల్ మార్ష్ (34 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. మార్ష్‌కు జతగా పూరన్ క్రీజ్‌లోకి వచ్చాడు.
ధాటిగా ఆడుతున్న లక్నో ఓపెనర్లు
నిదానంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన లక్నో ఓపెనర్లు ఆతర్వాత గేర్ మార్చారు. మార్క్రమ్ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (23 బంతుల్లో 34; ఫోర్, 3 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో 7 ఓవర్ల అనంతరం లక్నో స్కోర్ 72/0గా ఉంది.
గేర్ మార్చిన మార్క్రమ్
ఇన్నింగ్స్ ప్రారంభంలో నిదానంగా ఆడిన మార్క్రమ్ స్పెన్సర్ జాన్సన్ వేసిన నాలుగో ఓవర్‌లో గేర్ మార్చాడు. ఆ ఓవర్‌లో అతను 2 బౌండరీలు, సిక్సర్ సహా 18 పరుగులు రాబట్టాడు. 5 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 43/0గా ఉంది. మార్క్రమ్‌తో పాటు (28) మార్ష్ (13) క్రీజ్‌లో ఉన్నాడు.
ఆచితూచి ఆడుతున్న లక్నో ఓపెనర్లు
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిదానంగా ఆడుతుంది. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్ (9), మిచెల్ మార్ష్ (11) ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్ల తర్వాత లక్నో స్కోర్ 20/0గా ఉంది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 8) కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కేకేఆర్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
నేటి మ్యాచ్ కోసం కేకేఆర్ ఓ మార్పు చేసింది. మొయిన్ అలీ స్థానంలో స్పెన్సర్ జాన్సన్ తుది జట్టులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
ప్రస్తుతం కేకేఆర్, లక్నో పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటివరకు తలో 4 మ్యాచ్‌లు ఆడి రెండింట గెలిచి, రెండిట ఓడాయి. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరుకు ఐదు మ్యాచ్‌ల్లో తలపడగా.. లక్నో 3, కేకేఆర్ 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి.
తుది జట్లు..
కేకేఆర్: క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), సునీల్ నరైన్, అజింక్య రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా
లక్నో: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్‌కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్, దిగ్వేష్ రాఠి