
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటుమల పరంపర కొనసాగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ సన్‌రైజర్స్ ప్లేయర్లు తేలిపోయారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కోత్‌కతా బ్యాటర్లలో వెంకటేశ్ అయ్యర్(29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రఘువంశీ(50), రింకూ సింగ్(32), రహానే(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో కమ్మిన్స్, షమీ, హర్షల్ పటేల్, కమిందు మెండిస్ తలా వికెట్ సాధించారు.
చేతులేత్తేసిన బ్యాటర్లు..
అనంతరం 201 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఎస్ఆర్‌హెచ్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(33), మెండిస్(27) పర్వాలేదన్పించగా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు.
స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ(2), హెడ్(4), ఇషాన్ కిషన్(2) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి తలా మూడు వికెట్లు సాధించగా.. రస్సెల్ రెండు, హర్షిత్ రాణా, నరైన్ ఒక్క వికెట్ సాధించారు. ఈ మెగా టోర్నీలో ఎస్ఆర్‌హెచ్‌కు వరుసగా మూడో ఓటమి కావడం గమనార్హం.