IPL 2025 KKR vs GT: కేకేఆర్‌పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం | IPL 2025: Kolkata Knight Riders vs Gujarat Titans Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2025 KKR vs GT: కేకేఆర్‌పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం

Apr 21 2025 7:15 PM | Updated on Apr 21 2025 11:25 PM

IPL 2025: Kolkata Knight Riders vs Gujarat Titans Live Updates

PC: BCCI/IPL.com

IPL 2025 KKR vs GT Live Updates: 

కేకేఆర్‌పై గుజ‌రాత్ ఘ‌న విజ‌యం
ఐపీఎల్‌-2025లో గుజరాత్ టైటాన్స్ తమ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఈ ​మెగా ఈవెంట్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఘన విజయాన్ని గుజరాత్ అందుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగల్గింది.

కేకేఆర్ బ్యాటర్లలో కెప్టెన్ అజింక్య రహానే(50)టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. ఆఖ‌రిలో ర‌ఘువ‌న్షి(27) ప‌ర్వాలేద‌న్పించాడు. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్‌, ప్రసిద్ద్ కృష్ట తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, సుందర్‌, ఇషాంత్ శ‌ర్మ‌  సాయికిషోర్ చెరో వికెట్ పడగొట్టారు.

ఓటమి దిశగా కేకేఆర్‌..
గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఓట‌మి దిశ‌గా సాగుతోంది. వ‌రుస క్ర‌మంలో కోల్‌క‌తా మూడు వికెట్లు కోల్పోయింది. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో ర‌స్సెల్(24) ఔట్ కాగా.. ప్ర‌సిద్ద్ బౌలింగ్‌లో రమణ్‌దీప్ సింగ్‌(1) మోయిన్ అలీ(0) పెవిలియన్‌కు చేరారు. కేకేఆర్ విజయానికి 18 బంతుల్లో 75 పరుగులు కావాలి. క్రీజులో రింకూ సింగ్‌(6), రఘువన్షి(5) ఉన్నారు.

కేకేఆర్ మూడో వికెట్ డౌన్‌..
వెంక‌టేశ్ అయ్య‌ర్ రూపంలో కేకేఆర్ మూడో వికెట్ కోల్పోయింది. 14 ప‌రుగులు చేసిన అయ్య‌ర్‌.. సాయికిషోర్ బౌలింగ్‌లో పెవిలియ‌న్‌కు చేరాడు. క్రీజులోకి రింకూ సింగ్ వ‌చ్చాడు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ మూడు వికెట్ల న‌ష్టానికి 86 ప‌రుగులు చేసింది.

కేకేఆర్ నాలుగో వికెట్ డౌన్‌..
90 ప‌రుగుల వ‌ద్ద కేకేఆర్ నాలుగో వికెట్ కోల్పోయింది. 50 ప‌రుగులు చేసిన కెప్టెన్ అజింక్య ర‌హానే.. వాషింగ్ట‌న్ సుంద‌ర్ బౌలింగ్‌లో స్టంపౌట‌య్యాడు. 13 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ మూడు వికెట్ల న‌ష్టానికి 101 ప‌రుగులు చేసింది. క్రీజులో రింకూ సింగ్‌(2), ర‌స్సెల్‌(10) ఉన్నారు.

కేకేఆర్ రెండో వికెట్ డౌన్‌..
సునీల్ న‌రైన్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 17 ప‌రుగులు చేసిన న‌రైన్‌.. ర‌షీద్ ఖాన్ బౌలింగ్‌లో తెవాటియాకు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. 6 ఓవ‌ర్లు ముగిసే స‌రికి కేకేఆర్ రెండు వికెట్ల న‌ష్టానికి 45 ప‌రుగులు చేసింది. క్రీజులో వెంక‌టేశ్ అయ్య‌ర్‌(3), అజింక్య ర‌హానే(24) ఉన్నారు.

గుజ‌రాత్‌కు భారీ షాక్‌..
199 ప‌రుగుల‌తో భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్‌కు భారీ షాక్ త‌గిలింది. మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో గుర్భాజ్‌(1) ఎల్బీగా వెనుదిరిగాడు. క్రీజులోకి కెప్టెన్ అజింక్య ర‌హానే వ‌చ్చాడు.

శుబ్‌మ‌న్ గిల్ విధ్వంసం.. కేకేఆర్ టార్గెట్ ఎంతంటే?
ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కేకేఆర్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు.

55 బంతులు ఎదుర్కొన్న గిల్‌.. 10 ఫోర్లు, మూడు సిక్స్‌ల‌తో 90 ప‌రుగులు చేశాడు. గిల్‌తో పాటు సాయిసుద‌ర్శ‌న్‌(52), బ‌ట్ల‌ర్‌(41) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కేకేఆర్ బౌల‌ర్ల‌లో వైభ‌వ్ ఆరోరా, హ‌ర్షిత్ రాణా, ర‌స్సెల్ త‌లా వికెట్ సాధించారు.

దూకుడుగా ఆడుతున్న గిల్‌..
17 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 162 ప‌రుగులు చేసింది. క్రీజులో బ‌ట్ల‌ర్‌(26), శుబ్‌మ‌న్ గిల్‌(80) ఉన్నారు.

గుజ‌రాత్ తొలి వికెట్ డౌన్‌..
సాయిసుద‌ర్శ‌న్ రూపంలో గుజ‌రాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 52 ప‌రుగులు చేసిన సాయిసుద‌ర్శ‌న్‌.. ర‌స్సెల్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. క్రీజులోకి వ‌చ్చిన జోస్ బ‌ట్ల‌ర్ వ‌రుస‌గా మూడు బౌండరీలు బాదాడు. 14 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్టానికి 129 ప‌రుగులు చేసింది. క్రీజులో బ‌ట్ల‌ర్‌(13), శుబ్‌మ‌న్ గిల్‌(60) ఉన్నారు.

హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగిన గిల్‌, సుద‌ర్శ‌న్‌..
కేకేఆర్‌తో మ్యాచ్‌లో గుజ‌రాత్ ఓపెన‌ర్లు శుబ్‌మ‌న్ గిల్‌(52), సాయి సుద‌ర్శ‌న్(52) హాఫ్ సెంచ‌రీ మార్క్‌ను అందుకున్నారు. 12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్ట‌పోకుండా 113 ప‌రుగులు చేసింది.

గిల్ ఆన్ ఫైర్‌..
7 ఓవ‌ర్లు ముగిసే స‌రికి గుజ‌రాత్ టైటాన్స్ వికెట్ న‌ష్టపోకుండా 62 ప‌రుగులు చేసింది. కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్‌(39), సాయిసుద‌ర్శ‌న్(21) దూకుడుగా ఆడుతున్నారు.

నిల‌క‌డ‌గా ఆడుతున్న గిల్‌, సుద‌ర్శ‌న్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 4 ఓవ‌ర్లు ముగిసే స‌రికి వికెట్ న‌ష్ట‌పోకుండా 26 ప‌రుగులు చేసింది. క్రీజులో శుబ్‌మ‌న్ గిల్‌(6), సాయిసుద‌ర్శ‌న్‌(19) ఉన్నారు.

ఐపీఎల్‌-2025లో ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌, కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేకేఆర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ కీల‌క పోరులో కేకేఆర్ రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగింది. కేకేఆర్ తుది జ‌ట్టులోకి గుర్బాజ్‌, మోయిన్ అలీ వ‌చ్చారు. గుజ‌రాత్ మాత్రం త‌మ జ‌ట్టులో ఎటువంటి మార్పులు చేయ‌లేదు.

తుది జ‌ట్లు
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), జోస్ బట్లర్ (వికెట్ కీప‌ర్‌), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, రాహుల్ తెవాటియా, వాషింగ్టన్ సుందర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, అజింక్యా రహానే(కెప్టెన్‌), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, మొయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి
చ‌దవండి: IPL 2025: చ‌రిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్‌.. తొలి జట్టుగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement