source: X
ఐపీఎల్ స్టార్ (గుజరాత్ టైటాన్స్), ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ జోస్ బట్లర్‌కు శస్త్ర చికిత్స జరిగింది. దీంతో అతడు సుదీర్ఘకాలం క్రికెట్‌కు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఎడమ తొడ కండరానికి గాయం కావడంతో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని బట్లర్ సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించారు. అయితే, ఆయన ఎప్పుడు తిరిగి మైదానంలోకి వస్తారనే దానిపై స్పష్టత లేదు.
Jos Buttler confirms on Instagram that he has had surgery on his left hamstring - and is therefore set for a long spell on the sidelines https://t.co/CPZ7VV52sh
— Matt Roller (@mroller98) October 12, 2026
శ్రీలంక సిరీస్‌లో గాయం
ఇటీవల హెడింగ్లేలో శ్రీలంకతో జరిగిన వన్డేలో బట్లర్ గాయపడ్డాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. బట్లర్ 67 పరుగుల వద్ద గాయం కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే, కొద్దిసేపటికే తిరిగి బ్యాటింగ్‌కు వచ్చినా వెంటనే ఔటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. గాయం తీవ్రత కారణంగా బట్లర్ శ్రీలంకతో మిగిలిన వన్డేలకు దూరమయ్యాడు.
ఆస్ట్రేలియా పర్యటనకు దూరం
గాయం కారణంగా అక్టోబర్ 18 నుంచి పాకిస్తాన్‌లో ప్రారంభం కానున్న వన్డే ముక్కోణపు సిరీస్‌కు కూడా బట్లర్ దూరమయ్యాడు. త్వరాత ఆస్ట్రేలియా పర్యటనలోనూ అతడు ఆడే అవకాశం కనిపించడం లేదు. నవంబర్ 13 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ఇంగ్లండ్ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
ఐపీఎల్ 2027లో ఆడతాడా..?
శస్త్రచికిత్స కారణంగా బట్లర్ ఐపీఎల్ 2027లో పాల్గొనడంపై కూడా అనిశ్చితి నెలకొంది. మార్చి రెండో వారంలో ప్రారంభమవుతుందని భావిస్తున్న ఈ టోర్నీలో గుజరాత్ టైటాన్స్ తరఫున బట్లర్ బరిలోకి దిగాల్సి ఉంది. అయితే, అప్పటిలోగా ఆయన పూర్తిస్థాయిలో కోలుకుంటారా లేదా అన్నది చూడాలి.
అక్టోబర్‌లో జరగనున్న 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని బట్లర్‌ను తొందర పెట్టకూడదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు భావిస్తుంది.
ఇదీ చదవండి: విధ్వంసం సృష్టించిన రాహుల్ ద్రవిడ్ తనయుడు


