source: IPL X
ఐపీఎల్ 2027కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశముంది. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, భారత ఆటగాడు షారుఖ్ ఖాన్‌లను విడిచిపెట్టాలని ఆ జట్టు యాజమాన్యం భావిస్తున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. వీరిద్దరిని విడుదల చేస్తే వేలం కోసం గుజరాత్‌కు రూ.6 కోట్ల వరకు అదనపు నిధులు అందుబాటులోకి వస్తాయి.
మిడిలార్డర్‌పై దృష్టి
గుజరాత్ టైటాన్స్‌కు సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, జోస్ బట్లర్ రూపంలో బలమైన టాపార్డర్ ఉంది. అయితే మిడిలార్డర్‌లో నిలకడలేమి జట్టును ఇబ్బంది పెడుతోంది. గత సీజన్ ఫైనల్లోనూ టాపార్డర్ త్వరగా కుప్పకూలడంతో గుజరాత్ 155 పరుగులకే పరిమితమైంది. దీంతో వచ్చే సీజన్‌కు ముందు మిడిలార్డర్‌ను బలోపేతం చేయాలని యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం.
ఫిలిప్స్, షారుఖ్‌పై వేటు పడనుందా..?
గ్లెన్ ఫిలిప్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2026 కోసం రూ.2 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే ఆ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 67 పరుగులే చేశాడు. అంతకుముందు ఐపీఎల్ 2025లో గజ్జల్లో గాయం కారణంగా ఎక్కువ మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
మరోవైపు, షారుఖ్ ఖాన్ ఐపీఎల్ 2026లో ఐదు మ్యాచ్‌లు ఆడి 43 పరుగులే సాధించాడు. అతడి వార్షిక వేతనం రూ.4 కోట్లు. ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ ఇద్దరినీ విడుదల చేసి, వేలంలో మిడిలార్డర్‌కు బలాన్నిచ్చే ఆటగాళ్లను తీసుకోవాలని గుజరాత్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ప్రొఫెషనల్ క్రికెట్‌కు హార్దిక్ పాండ్యా దూరం..!


